ఏడో రోజూ బుల్‌ జోరు
close

Published : 19/10/2021 02:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏడో రోజూ బుల్‌ జోరు

సమీక్ష

రుసగా ఏడో రోజూ బుల్‌ దుమ్మురేపింది. అంతర్జాతీయ సంకేతాలు ప్రతికూలంగా ఉన్నప్పటికీ మదుపర్లు ఐటీ, బ్యాంకింగ్‌, లోహ షేర్లలో కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఫలితంగా సెన్సెక్స్‌, నిఫ్టీ తాజా రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. రోజంతా లాభాల్లోనే కదలాడిన సెన్సెక్స్‌ .. ఇంట్రాడేలో 61,963.07 వద్ద తాజా జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 459.64 పాయింట్ల నష్టంతో 61,765.59 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 138.50 పాయింట్లు పెరిగి 18,477.05 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 18,543.15 పాయింట్ల వద్ద కొత్త రికార్డు గరిష్ఠాన్ని నమోదుచేసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 9 పైసలు తగ్గి 75.35 వద్ద ముగిసింది.

* సెప్టెంబరు త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో డి-మార్ట్‌ విక్రయశాలలను నిర్వహించే అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ షేరు ఇంట్రాడేలో 10.69 శాతం దూసుకెళ్లి రూ.5,899.90 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని తాకింది. అయితే లాభాల స్వీకరణ ఎదురుకావడంతో చివరకు  8.16% కోల్పోయి రూ.4,894.90 వద్ద ముగిసింది.

* సెన్సెక్స్‌ 30 షేర్లలో 17 రాణించాయి. ఇన్ఫోసిస్‌ 4.47%, టెక్‌ మహీంద్రా 3.36%, టాటా స్టీల్‌ 2.73%, ఐసీఐసీఐ బ్యాంక్‌ 2.48%, ఐటీసీ 2.30%, మారుతీ   2.16%, ఎస్‌బీఐ 1.50% లాభపడ్డాయి. ఎం అండ్‌ ఎం 2.24%, డాక్టర్‌ రెడ్డీస్‌ 1.73%, ఏషియన్‌ పెయింట్స్‌   1.66% డీలాపడ్డాయి. 

* బుల్‌ పరుగులతో మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మార్కెట్‌ విలువ గత ఏడు రోజుల్లో రూ.12.49 లక్షల కోట్లు పెరిగి రికార్డు గరిష్ఠమైన రూ.274.69 లక్షల కోట్లుగా నమోదైంది.

* త్రైమాసిక ఫలితాలు మదుపర్లను మెప్పించకపోవడంతో హెచ్‌సీఎల్‌ టెక్‌ షేరు 2.36 శాతం నష్టంతో రూ.1221.35 వద్ద ముగిసింది.

* సూచీలు తాజా గరిష్ఠాలకు చేరడంతో సెన్సెక్స్‌ 30లో 12 షేర్లు 52 వారాల గరిష్ఠాలకు చేరాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఐటీసీ, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్‌, ఎస్‌బీఐ, సన్‌ఫార్మా, టైటన్‌ వంటి కంపెనీలు ఇందులో ఉన్నాయి.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని