జెట్‌ వ్యవహారం ఎంతో సంక్లిష్టం
close

Published : 20/10/2021 01:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జెట్‌ వ్యవహారం ఎంతో సంక్లిష్టం

ఎస్‌బీఐ మాజీ ఛైర్మన్‌ రజనీశ్‌కుమార్‌ 

దిల్లీ: సహకారం అందిస్తామంటూ ప్రభుత్వం నుంచి హామీ లేఖ ఉంటేనే జెట్‌ ఎయిర్‌వేస్‌ రుణ పరిష్కార ప్రణాళికను ఆమోదించాలని స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) బోర్డు సభ్యులు గట్టిగా పట్టుబట్టారని ఎస్‌బీఐ మాజీ ఛైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌ వెల్లడించారు. ఎస్‌బీఐ అధిపతిగా తన అనుభవాలతో ‘ద కస్టోడియన్‌ ఆఫ్‌ ట్రస్ట్‌’ పేరిట రాసిన పుస్తకంలో రజనీశ్‌ ఈ వివరాలు తెలిపారు. తాను ఎదుర్కొన్న సంక్లిష్ట అంశాల్లో జెట్‌ ఎయిర్‌వేస్‌ వ్యవహారం ఒకటని పేర్కొన్నారు. చాలా బ్యాంకులు జెట్‌ ఎయిర్‌వేస్‌ పరిష్కార ప్రణాళికను ఆమోదించేందుకు విముఖత చూపాయని, నిర్దేశిత సమయంలో ప్రమోటర్లు షరతులను పూర్తిచేయలేకపోవడమే ఇందుకు కారణమని వివరించారు. బ్యాంకు విశ్వసనీయతపై ప్రభావం పడకూడదనే ఎస్‌బీఐ బోర్డు డైరెక్టర్లు కూడా ప్రభుత్వ లేఖ అవసరమని గట్టిగా పేర్కొన్నట్లు  తెలిపారు. ఈ నేపథ్యంలోనే 2019 ఏప్రిల్‌ 17న జెట్‌ కార్యకలాపాలు నిలిచిపోగా, ఆ సంస్థపై ఎస్‌బీఐ నేతృత్వంలో బ్యాంకులు వేసిన దివాలా పిటిషన్‌ను జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ముంబయి) అనుమతించిందని గుర్తు చేశారు. వెండర్లకు రూ.25,000 కోట్లతో పాటు బ్యాంకులకు జెట్‌ రూ.8000 కోట్లు చెల్లించాల్సి ఉందని తెలిపారు. జెట్‌ విమానాల్లో అధికం లీజ్‌పై తీసుకున్నవి కావడం, ఆ సంస్థకు ఉన్న స్లాట్స్‌ విమానాశ్రయాలవి అయినందున, సంస్థ పునరుద్ధరణపై తనకూ చాలా తక్కువ ఆశలే ఏర్పడ్డాయని పేర్కొన్నారు. ఒక ఆర్థిక సంస్థను గట్టెక్కించేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు ఉన్న అధికారాల తరహాలో, విమానయాన రంగానికి ఏ సంస్థా లేదని రజనీశ్‌ తెలిపారు. ప్రైవేటు రంగంలోని నాలుగో అతిపెద్దది అయిన యెస్‌ బ్యాంక్‌ కుప్పకూలే ప్రమాదం ఏర్పడటంతో దేశంలో ప్రైవేటు బ్యాంకింగ్‌ విశ్వసనీయతకు బీటలు వారే పరిస్థితి ఏర్పడిందని, కొన్ని పెద్ద బ్యాంకింగేతర సంస్థలు విఫలం కావడం, నిరర్థక ఆస్తులు పెరగడం వల్ల బ్యాంకుల బ్యాలెన్స్‌ షీట్లపై ప్రతికూల ప్రభావం పడందని విశదీకరించారు.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని