ఓలా నుంచి వైదొలగనున్న సీఓఓ, సీఎఫ్‌ఓ
close

Published : 20/10/2021 01:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఓలా నుంచి వైదొలగనున్న సీఓఓ, సీఎఫ్‌ఓ

దిల్లీ: ఓలా తన యాజమాన్య వ్యవస్థలోని కొందరి ఉన్నతాధికారుల బాధ్యతల్లో మార్పులు చేసింది. వాహన (మొబిలిటీ) రంగ వ్యాపారాన్ని బలోపేతం చేసేందుకు, కొత్త వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఈ చర్యలు చేపట్టింది. ఓలా సీఎఫ్‌ఓ (ముఖ్య ఆర్థిక అధికారి) స్వయం సౌరభ్‌, సీఓఓ (ముఖ్య కార్యకలాపాల అధికారి) గౌరవ్‌ పోర్వాల్‌లు కంపెనీ నుంచి వైదొలగనున్నారు. ఓలా డెలివరీ బిజినెస్‌ సీఈఓగా ఉన్న వినయ్‌ భోపాట్కర్‌.. మొబిలిటీ వ్యాపారం డ్రైవర్‌, సరఫరా వ్యవస్థలకు సంబంధించి అదనపు బాధ్యతలను చేపట్టనున్నారు. ఓలా ముఖ్య మార్కెటింగ్‌ అధికారి అన్షుల్‌ ఖండేల్‌వాల్‌ ఆదాయ విభాగ బాధ్యతలు కూడా నిర్వహించనున్నారని ఉద్యోగులకు పంపిన ఇ-మెయిల్‌లో ఓలా ఛైర్మన్‌, గ్రూపు సీఈఓ భావిశ్‌ అగర్వాల్‌ తెలియజేశారు. ఓలా కార్స్‌ సీఈఓ అరుణ్‌ సర్దేశ్‌ముఖ్‌.. అదే హోదాలో కొనసాగుతారని పేర్కొన్నారు. గ్రూపు సీఎఫ్‌ఓ అరుణ్‌ కుమార్‌ జీఆర్‌.. ఆర్థిక కార్యకలాపాల బాధ్యతలను నిర్వహిస్తారని, ప్రధాన ఆర్థిక విభాగాలను చూసుకునే అధికారులందరూ అరుణ్‌కే నివేదించాలని తెలిపారు.


గ్రామీణ వృద్ధికి రూ.500 కోట్ల నిధి
పీఅండ్‌జీ ఇండియా

దిల్లీ: దేశీయ గ్రామీణ విపణిలో సమ్మిళిత వృద్ధిని వేగవంతం చేయడానికి ప్రోక్టర్‌ అండ్‌ గ్యాంబుల్‌ (పీఅండ్‌జీ) రూ.500 కోట్లతో ‘పీఅండ్‌జీ రూరల్‌ గ్రోత్‌ ఫండ్‌’ను ఏర్పాటు చేసింది. ఈ నిధిని గ్రామీణ వినియోగదార్ల అవసరాలను తీర్చడానికి అనుకూలించే వ్యాపార పరిష్కారాలలో తమకు సహకరించే  భాగస్వాములకు (ఎక్స్‌టర్నల్‌ పార్ట్‌నర్స్‌) అందించనుంది. ఇందులో ఉన్నత కమ్యూనికేషన్‌, ప్రభావవంత మీడియా, టెక్‌ ఆధారిత విక్రయాలు, పంపిణీ పెంచడం, ఇంటి వద్దకే డెలివరీ వంటి గో-టు-మార్కెట్‌ పరిష్కారాలుంటాయని కంపెనీ తెలిపింది. ‘కొవిడ్‌ మహమ్మారి ప్రభావం నుంచి కోలుకోవడంలో గ్రామీణ విపణి కీలక పాత్ర పోషిస్తోంది. అందుకే దీనిపై దృష్టి సారించాం. ‘విగ్రో’ ప్లాట్‌ఫామ్‌ ద్వారా 2,000కు పైగా భారతీయ సరఫరాదార్లతో (అంకుర సంస్థలు, చిన్న వ్యాపార సంస్థలు, పెద్ద సంస్థలు, వ్యక్తులు) భాగస్వామ్యమవుతామ’ని పీఅండ్‌జీ ఇండియా సీఈఓ మధుసూదన్‌ గోపాలన్‌ వెల్లడించారు.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని