24 శాతం పెరిగిన ఏసీసీ లాభం
close

Published : 20/10/2021 01:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

24 శాతం పెరిగిన ఏసీసీ లాభం

దిల్లీ: సిమెంట్‌ దిగ్గజ సంస్థ ఏసీసీ సెప్టెంబరు త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.450.21 కోట్ల నికర లాభాన్ని నమోదుచేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆర్జించిన రూ.363.85 కోట్ల నికర లాభంతో పోలిస్తే ఇది 23.74 శాతం అధికం. మొత్తం ఆదాయం రూ.3,537.31 కోట్ల నుంచి 5.98 శాతం పెరిగి రూ.3,749 కోట్లకు చేరింది. మొత్తం వ్యయాలు రూ.3,042.75 కోట్ల నుంచి 5.31 శాతం అధికమై రూ.3,204.40 కోట్లకు చేరాయి. సిమెంట్‌ విక్రయాలు 6.49 మిలియన్‌ టన్నుల నుంచి 1.23 శాతం పెరిగి 6.57 మి.టన్నులుగా నమోదయ్యాయి. సిమెంట్‌ ఆదాయం 3.62 శాతం పెరిగి రూ.3,495.49 కోట్లకు, రెడీ మిక్స్‌ కాంక్రీట్‌ ఆదాయం 55.2 శాతం పెరిగి రూ.305.07 కోట్లకు చేరింది. గత త్రైమాసికంలో కంపెనీ అద్భుత పనితీరు కనబరిచిందని, వినియోగదారుల అవసరాలపై దృష్టి పెట్టనున్నట్లు ఏసీసీ ఎండీ, సీఈఓ శ్రీధర్‌ బాలకృష్ణన్‌ పేర్కొన్నారు. గృహ, వాణిజ్య, పారిశ్రామిక, మౌలిక రంగాల నుంచి గిరాకీ పెరుగుతున్నందున, రాబోయే త్రైమాసికాల్లో సిమెంటుకు గిరాకీ బాగుంటుందనే అంచనాను వ్యక్తం చేశారు. కంపెనీ జనవరి- డిసెంబరును ఆర్థిక సంవత్సరంగా పాటిస్తుంది.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని