ఓటీటీ సంస్థల కోసం.. ఎయిర్‌టెల్‌ ఐక్యూ వీడియో
close

Published : 20/10/2021 01:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఓటీటీ సంస్థల కోసం.. ఎయిర్‌టెల్‌ ఐక్యూ వీడియో

ఈనాడు, హైదరాబాద్‌: డిజిటల్‌ వినోదాన్ని అందించే సంస్థలకు వీడియో ఫ్లాట్‌ఫాం యాజ్‌ ఎ సర్వీస్‌ సేవలను భారతీ ఎయిర్‌టెల్‌ ప్రారంభించింది. ఈ ‘ఎయిర్‌టెల్‌ ఐక్యూ వీడియో’తో దాదాపు రూ.750 కోట్ల వ్యాపార లక్ష్యాన్ని సాధించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ వేదికను ఉపయోగించుకునేందుకు 3 సంస్థలతో ఒప్పందాలు కుదిరాయని తెలిపింది. ఎయిర్‌టెల్‌ క్లౌడ్‌ ద్వారా వీడియో ఆధారిత సేవలనందించే సంస్థలు తక్కువ ఖర్చుతో ఈ సేవలను వినియోగించుకునే వీలుందని ఎయిర్‌టెల్‌ చీఫ్‌ ప్రొడక్ట్‌ ఆఫీసర్‌ ఆదర్శ్‌ నాయర్‌ మంగళవారం దృశ్య మాధ్యమ సమావేశంలో వెల్లడించారు. అంకుర సంస్థలు, సంప్రదాయ వీడియో కంటెంట్‌ సంస్థలు ఆన్‌లైన్‌లో నేరుగా వీక్షకులను చేరుకునేందుకు ఇది వీలు కల్పిస్తుందని వెల్లడించారు.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని