రూ.6,017 కోట్లతో పాలసీ బజార్‌ ఐపీఓ
close

Published : 20/10/2021 01:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రూ.6,017 కోట్లతో పాలసీ బజార్‌ ఐపీఓ

దిల్లీ: పాలసీ బజార్‌ మాతృసంస్థ పీబీ ఫిన్‌టెక్‌ లిమిటెడ్‌ పబ్లిక్‌ ఇష్యూకు సెబీ ఆమోదం తెలిపింది. ప్రతిపాదిత తొలి పబ్లిక్‌ ఆఫర్‌ ద్వారా కంపెనీ రూ.6,017.50 కోట్లు సమీకరించాలని అనుకుంటోంది. ఇష్యూలో భాగంగా రూ.3,750 కోట్ల విలువైన తాజా షేర్ల జారీతో పాటు ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో (ఓఎఫ్‌ఎస్‌) వాటాదార్లకు చెందిన రూ.2,267.50 కోట్ల విలువైన షేర్లను విక్రయించనుంది. ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను బ్రాండు ప్రచారానికి, కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేందుకు, వినియోగదార్ల సంఖ్యను పెంచుకునేందుకు ఉపయోగించుకోనుంది.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని