వోల్వో ఎస్‌90, ఎక్స్‌సీ60
close

Updated : 20/10/2021 12:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వోల్వో ఎస్‌90, ఎక్స్‌సీ60

దిల్లీ: పెట్రోల్‌-స్వల్ప హైబ్రిడ్‌ పవర్‌ట్రెయిన్‌తో ఎస్‌90, ఎక్స్‌సీ60 మోడళ్లను వోల్వో కార్‌ ఇండియా మంగళవారం విపణిలోకి విడుదల చేసింది. ఈ రెండు మోడళ్ల ధరలు రూ.61.9 లక్షలని (ఎక్స్‌-షోరూమ్‌) తెలిపింది. ఎస్‌90 బీ5 ఇన్‌స్క్రిప్షన్‌ సెడాన్‌, ఎక్స్‌సీ60 బీ5 ఇన్‌స్క్రిప్షన్‌ ఎస్‌యూవీలు ప్రస్తుతం 1,969 సీసీ పెట్రోల్‌ ఇంజిన్‌తో పాటు 48-వోల్ట్‌ బ్యాటరీతో వస్తున్నాయి. 2022లో తొలి బ్యాటరీ-విద్యుత్‌ కారును విడుదల చేస్తామని వోల్వో కార్‌ ఇండియా ఎండీ జ్యోతి మల్హోత్రా వెల్లడించారు. ప్రస్తుత మోడళ్లతో పాటు త్వరలో రాబోయే ఎక్స్‌సీ90 మోడల్‌తో తమ సంస్థ పెట్రోల్‌ పోర్ట్‌ఫోలియోకి పూర్తిగా మారినట్లు అవుతుందని ఆయన పేర్కొన్నారు. 2030 నాటికి కంపెనీ నుంచి పూర్తిస్థాయి విద్యుత్‌ కారు వస్తుందని వెల్లడించారు. ఎస్‌90, ఎక్స్‌సీ60 మోడళ్లలో గూగుల్‌ యాప్స్‌, ఇతర యాప్స్‌కు యాక్సెస్‌ ఇచ్చేలా డిజిటల్‌ సేవలు (గూగుల్‌ అసిస్టెంట్‌తో హ్యాండ్స్‌-ఫ్రీ సాయం, గూగుల్‌ మ్యాప్స్‌తో నావిగేషన్‌ వంటి సదుపాయాలు) కల్పించారు.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని