జీఎంఆర్‌ హైదరాబాద్‌ విమానాశ్రయ విస్తరణ
close

Published : 21/10/2021 04:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జీఎంఆర్‌ హైదరాబాద్‌ విమానాశ్రయ విస్తరణ

అదనపు విమాన సర్వీసులకు ఏర్పాట్లు 

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏడాదికి 3.40 కోట్ల మంది కంటే ఎక్కువ మంది వినియోగించుకునేలా విస్తరించనున్నారు. తొలుత 1.20 కోట్ల మంది వచ్చి వెళ్లేందుకు వీలుగా నిర్మించినా, దశల వారీగా విస్తరిస్తున్నారు. 2019 ఆర్థిక సంవత్సరంలో ఇక్కడ నుంచి 2.10 కోట్ల మంది ప్రయాణించారు. సమీప భవిష్యత్తులో ప్రయాణికుల రాకపోకలు గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నందున, దీనికి అనువుగా జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ (జీహెచ్‌ఐఏఎల్‌) విస్తరణ సన్నాహాలు చేపట్టింది. హైదరాబాద్‌ నుంచి కొత్త గమ్య స్థానాలకు విమాన సర్వీసులు మొదలవుతున్నాయి. రన్‌వే స్లాట్లకు డిమాండ్‌ పెరుగుతోంది. అందువల్ల విస్తరణ తప్పనిసరి అవుతోంది. పునరుద్ధరించిన టెర్మినల్‌తో పాటు ఎయిర్‌సైడ్‌, సిటీ సైడ్‌ ప్రాంతాలను విమానాశ్రయం విస్తరణలో భాగంగా సిద్ధం చేస్తారు. ఎయిర్‌సైడ్‌లో 93 కోడ్‌-సి ఎయిర్‌క్రాఫ్ట్‌ స్టాండ్లు అందుబాటులోకి వస్తాయి.

సురక్షిత ప్రయాణానికి..: రద్దీ పెరిగినా విమానాల రాకపోకలను మరింత సురక్షితంగా నిర్వహించడానికి, ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రయాణికులు, బ్యాగేజ్‌ క్లియరెన్స్‌ నిమిత్తం, గ్రౌండ్‌ సర్వీస్‌ ఎక్విప్‌మెంట్‌ వాహనాల రాకపోకల కోసం నూతన సొరంగ మార్గాన్ని నిర్మిస్తున్నారు. రన్‌వే సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి కొత్తగా 4 ర్యాపిడ్‌ ఎగ్జిట్‌ ట్యాక్సీవే లను సిద్ధం చేశారు. దీనివల్ల విమానాలు తక్కువ సమయంలోనే రన్‌వే నుంచి టేకాఫ్‌ తీసుకుంటాయి. రన్‌వే ను విమానాలు త్వరగా ఖాళీ చేస్తాయి కాబట్టి ఎక్కువ విమానాలు టేకాఫ్‌ తీసుకునేందుకు వీలవుతుంది. అడ్వాన్స్‌డ్‌ ఎయిర్‌ఫీల్డ్‌ లైటింగ్‌ కంట్రోల్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ను ఎయిర్‌ఫీల్డ్‌లో ఏర్పాటు చేస్తున్నారు. వర్షాకాలంలో నీరు నిలవకుండా, సాఫీగా వెళ్లేందుకు వీలుగా ఎయిర్‌సైడ్‌లో 16 లక్షల చదరపు మీటర్ల ప్రాంతాన్ని చదును చేస్తారు. వాన నీటిని నిల్వ చేసేందుకు 450 ఎంఎల్‌డి సామర్థ్యం కల రిజర్వాయర్‌ నిర్మించి, ఆ నీటిని శుద్ధి చేసి అన్ని రకాల అవసరాలకు వినియోగిస్తారు.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని