కార్యాలయాల స్థలాలకు గిరాకీ
close

Published : 21/10/2021 04:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కార్యాలయాల స్థలాలకు గిరాకీ

జనవరి కల్లా కొవిడ్‌ ముందుస్థాయికి
స్కూటర్‌ దేశీయ అధిపతి రజత్‌ జోహార్‌

ఈనాడు, హైదరాబాద్‌: మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆహ్లాదకర పని వాతావారణం అవసరం ఎంతో ఉందని, కార్యాలయ స్థలాలను అద్దెకిచ్చే స్కూటర్‌ సంస్థ దేశీయ అధిపతి రజత్‌ జోహార్‌ అన్నారు. హైదరాబాద్‌ హైటెక్‌ సిటీలో సంస్థ 1.20 లక్షల చదరపు అడుగుల్లో రెండో ఆఫీసు స్పేస్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘అరణ్యం’ భావనతో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయంలో దాదాపు 150కి పైగా జాతులకు చెందిన 8,000 మొక్కలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఆఫీస్‌ స్పేస్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థల వల్ల బహుళజాతి సంస్థలు, స్థానిక కంపెనీలకు కార్యాలయ ఏర్పాటు భారం తగ్గుతుందని తెలిపారు. దేశంలో తమ నిర్వహణలో 9 ఆఫీస్‌ స్పేస్‌లు ఉన్నాయని తెలిపారు. రెండేళ్లలో ఇక్కడ 10లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యాలయాలను ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. పలు ఎంఎన్‌సీలు అవసరమైతే విస్తరణ.. లేదా తగ్గించుకునే వీలుండే ఫ్లెక్సీ ఆఫీసు స్థలం కోసం చూస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా ఐటీ/ఐటీ సేవల సంస్థల నుంచి గిరాకీ పెరిగిందన్నారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని