ఆర్‌వీ400 బుకింగ్‌లు నేటినుంచే
close

Published : 21/10/2021 04:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆర్‌వీ400 బుకింగ్‌లు నేటినుంచే

100 శాతం విడిభాగాలు ఇక్కడే సమీకరిస్తాం: రివోల్ట్‌

దిల్లీ: విద్యుత్‌ బైక్‌ల తయారీ సంస్థ రివోల్ట్‌ మోటార్స్‌ వచ్చే జనవరి నుంచి తమ ఉత్పత్తులకు కావాల్సిన విడిభాగాలను 100 శాతం దేశీయంగానే సమీకరించనున్నట్లు బుధవారం వెల్లడించింది. ఇప్పటికే 70 శాతం విడిభాగాలను స్థానికంగా సమీకరిస్తున్నామంది. తమ విద్యుత్‌ మోటార్‌సైకిల్‌ ఆర్‌వీ400 బుకింగ్‌లను దేశవ్యాప్తంగా 70 నగరాల్లో గురువారం ప్రారంభిస్తున్నట్లు రివోల్ట్‌ మోటార్స్‌ వ్యవస్థాపకులు రాహుల్‌ శర్మ వెల్లడించారు. ఈ బైక్‌లు కాస్మిస్‌ బ్లాక్‌, రెబెల్‌ రెడ్‌, మిస్ట్‌ గ్రే రంగుల్లో లభ్యమవుతున్నాయి. 3 కిలోవాట్‌ మోటార్‌, 3.24 కిలోవాట్‌ లిథియమ్‌-అయాన్‌ బ్యాటరీ, గంటకు 85 కి.మీ గరిష్ట వేగం ఈ బైక్‌ల సొంతం.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని