అమెజాన్‌ కేసులో ఫ్యూచర్‌ రిటైల్‌ కూడా భాగమే!
close

Published : 21/10/2021 04:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమెజాన్‌ కేసులో ఫ్యూచర్‌ రిటైల్‌ కూడా భాగమే!

సింగపూర్‌ ప్యానెల్‌ తీర్పు

అమెజాన్‌.కామ్‌ ఇంక్‌తో జరుగుతున్న వాణిజ్య వివాదం కేసులో ఫ్యూచర్‌ రిటైల్‌ కూడా పాలుపంచుకోవాల్సిందేనని సింగపూర్‌కు చెందిన ఆర్బిట్రేషన్‌ ప్యానెల్‌ తీర్పునిచ్చింది. ఈ ప్రక్రియ నుంచి తమను మినహాయించాలని కోరుతూ ఫ్యూచర్‌ రిటైల్‌ దాఖలు చేసుకున్న విజ్ఞప్తిని తిరస్కరించింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు తమ రిటైల్‌ ఆస్తులను 3.4 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.25,000 కోట్ల)కు విక్రయించాలన్న తమ ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి అమెజాన్‌ ప్రయత్నిస్తోందని, కాంట్రాక్టులను ఉల్లంఘిస్తున్నారంటూ ఆరోపిస్తోందని ఫ్యూచర్‌ పేర్కొంది. తాము ఎటువంటి తప్పూ చేయలేదని పేర్కొంది. ఈ ఒప్పందం విషయంలో ముందుకెళ్లరాదంటూ సింగపూర్‌ ఆర్బిట్రేటర్‌ గతేడాది మధ్యంతర నిర్ణయం ప్రకటించిన సంగతి తెలిసిందే. మరో ఫ్యూచర్‌ గ్రూప్‌ కంపెనీతో  అమెజాన్‌ కాంట్రాక్టు కుదుర్చుకుని, తమపై తప్పుగా ఆర్బిట్రేషన్‌ కేసులు వేసినందున,  తమను ఈ కేసు నుంచి మినహాయించాలని ఫ్యూచర్‌ రిటైల్‌ కోరింది. అందుకు ప్యానెల్‌ అంగీకరించలేదని బుధవారం వెలువడ్డ తీర్పు ప్రతిని సమీక్షించిన వార్తా సంస్థ రాయిటర్స్‌ పేర్కొంది. ప్యానెల్‌ తీర్పు ఇంకా బహిరంగం కాలేదు. ఫ్యూచర్‌-అమెజాన్‌ వివాదంలో మూడు ఒప్పందాలను కలిసే చూడాలని.. ఫ్యూచర్‌ రిటైల్‌ అంటున్నట్లుగా విడిగా చూడలేమని 69 పేజీల ఆదేశాల్లో ప్యానెల్‌ పేర్కొంది. ఫ్యూచర్‌, అమెజాన్‌లు ఈ విషయంపై స్పందించలేదు.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని