ఐఎంఎఫ్‌ బాధ్యతల నుంచి వైదొలగనున్న గీతా గోపినాథ్‌
close

Published : 21/10/2021 04:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఐఎంఎఫ్‌ బాధ్యతల నుంచి వైదొలగనున్న గీతా గోపినాథ్‌

దిల్లీ: అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) ముఖ్య ఆర్థికవేత్త బాధ్యతల నుంచి గీతా గోపీనాధ్‌ వచ్చే ఏడాది జనవరిలో వైదొలగనున్నారు. ఆమె మళ్లీ ప్రతిష్ఠాత్మక హార్వర్డ్‌ విశ్వవిద్యాలయ అర్థశాస్త్ర విభాగంలో చేరనున్నట్లు తెలుస్తోంది. 49 ఏళ్ల గీతా గోపీనాథ్‌.. 2019 జనవరిలో ఐఎంఎఫ్‌ ముఖ్య ఆర్థికవేత్తగా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో ఆమె ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఐఎంఎఫ్‌ తదుపరి ముఖ్య ఆర్థికవేత్తను నియమించేందుకు అన్వేషిస్తున్నామని ఐఎంఎఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్రిస్టలినా జార్జీవా తెలిపారు. ఐఎంఎఫ్‌కు గీతా గోపీనాధ్‌ అందించిన సేవలు అమూల్యమైనవని, ఐఎంఎఫ్‌ కార్యకలాపాలపై ఆమె ప్రభావం అద్భుతమని జార్జీవా తెలిపారు. మైసూర్‌లో జన్మించిన గీతా గోపీనాధ్‌.. ఐఎంఎఫ్‌కు మొదటి మహిళా ముఖ్యఆర్థిక వేత్త.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని