టెస్ట్‌ డ్రైవ్‌ తర్వాతే చెల్లింపులు: ఓలా
close

Published : 21/10/2021 04:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టెస్ట్‌ డ్రైవ్‌ తర్వాతే చెల్లింపులు: ఓలా

దిల్లీ: ఓలా విద్యుత్‌ స్కూటర్లను అంతక్రితం ప్రకటించిన ‘నిర్దేశిత డెలివరీ సమయానికే’ వినియోగదార్లకు అందిస్తామని ఓలా ఎలక్ట్రిక్‌ స్పష్టం చేసింది. ఎస్‌1 స్కూటర్లను బుక్‌ చేసుకున్నవారు నవంబరు 10 నుంచి మొదలయ్యే టెస్ట్‌ డ్రైవ్‌లను పూర్తి చేశాకే, తుది చెల్లింపులను స్వీకరిస్తామని ప్రకటించింది. ఈ నెల నుంచే స్కూటర్ల డెలివరీలు మొదలవుతాయని గతంలో కంపెనీ చెప్పింది. అక్టోబరు 18 నుంచి ఎస్‌1, ఎస్‌1 ప్రో  కోసం తుది చెల్లింపులను స్వీకరించాల్సి ఉంది. అక్టోబరు 25 నుంచి డెలివరీలు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే టెస్ట్‌ డ్రైవ్‌ అనంతరమే పూర్తి చెల్లింపులు చేయాలని ఇపుడు కంపెనీ కోరుతుండడంతో,  డెలివరీ ఎప్పుడనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  ‘ప్రతి వినియోగదారుకు ఒక నిర్దిష్ట డెలివరీ సమయాన్ని సూచించాం. ఆ విధంగానే డెలివరీ చేసేందుకే ప్రయత్నిస్తున్నామ’ని కంపెనీ పేర్కొంది. టెస్ట్‌ డ్రైవ్‌ అనంతరం బుకింగ్‌ను రద్దు చేసుకోవాలని ఎవరైనా భావిస్తే, అంతవరకు చెల్లించిన మొత్తాన్ని రిఫండ్‌ చేస్తామని తెలిపింది.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని