స్పెక్ట్రమ్‌ బకాయిలపై 4 ఏళ్ల మారటోరియానికి వొడాఫోన్‌ ఐడియా
close

Published : 21/10/2021 06:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

స్పెక్ట్రమ్‌ బకాయిలపై 4 ఏళ్ల మారటోరియానికి వొడాఫోన్‌ ఐడియా

దిల్లీ: టెలికాం రంగానికి ప్రభుత్వం ప్రకటించిన ఉపశమన ప్యాకేజీలో భాగంగా, స్పెక్ట్రమ్‌ బకాయిల చెల్లింపునకు నాలుగేళ్ల మారటోరియంను ఎంచుకోవాలని డైరెక్టర్ల బోర్డు నిర్ణయించినట్లు వొడాఫోన్‌ ఐడియా వెల్లడించింది. టెలికాం విభాగం (డాట్‌) సూచించిన ఇతర అవకాశాలను సైతం నిర్ణీత కాలవ్యవధిలో డైరెక్టర్ల బోర్డు పరిశీలించనున్నట్లు ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో కంపెనీ పేర్కొంది. 2021 అక్టోబరు నుంచి 2025 సెప్టెంబరు మధ్య చెల్లించాల్సిన స్పెక్ట్రమ్‌ బకాయిలను కంపెనీ వాయిదా వేసుకోనుంది. నాలుగేళ్ల మారటోరియం సదుపాయాన్ని పొందే విషయంపై అక్టోబరు 29లోగా స్పష్టత ఇవ్వాల్సిందిగా గతవారం ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా, రిలయన్స్‌ జియోలకు ప్రభుత్వం లేఖ రాసింది.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని