రుపే కార్డులు మరింత భద్రం
close

Updated : 21/10/2021 11:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రుపే కార్డులు మరింత భద్రం

టోకనైజేషన్‌ తీసుకొచ్చిన ఎన్‌పీసీఐ

దిల్లీ: రుపే కార్డుల్లో డేటా భద్రతను మరింత పదిలం చేసేందుకు టోకనైజేషన్‌ వ్యవస్థను తీసుకొస్తున్నట్లు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్‌పీసీఐ) ప్రకటించింది. అంటే మర్చంట్ల వద్ద కార్డు వివరాలను భద్రపరచడానికి ప్రత్యామ్నాయంగా ఈ వ్యవస్థను వినియోగిస్తారన్నమాట. దీని వల్ల వినియోగదార్ల వివరాలకు మరింత గోప్యత, భద్రత ఏర్పడడమే కాకుండా.. కొనుగోళ్లు సులభమవుతాయి. ఎన్‌క్రిప్టెడ్‌ రూపంలో వినియోగదారు సమాచారాన్ని ‘టోకెన్‌’ రూపంలో భద్రపరచడం వల్ల లావాదేవీలకు కూడా భద్రత ఏర్పడుతుందని ఎన్‌పీసీఐ పేర్కొంది. వినియోగదారు వివరాలను వెల్లడించకుండానే చెల్లింపుల ప్రక్రియకు ఈ టోకెన్లు వీలు కల్పిస్తాయి. ఎన్‌పీసీఐ టోకనైజేషన్‌ సిస్టమ్‌ కింద  బ్యాంకులు, అగ్రిగేటర్లు, మర్చంట్లు, ఇతరులు ఎన్‌పీసీఐ వద్ద ధ్రువీకరణ పత్రం పొందితే ‘టోకెన్‌ రిక్వెస్టర్‌’ పాత్రను పోషించవచ్చు. రుపే వినియోగదార్లు భవిష్యత్‌లో చేసే లావాదేవీలకు ఈ అన్ని వ్యాపార వర్గాలు తమ రుపే వినియోగదార్ల టోకెన్‌ రెఫరెన్స్‌ ఆన్‌ఫైల్‌(టీఆర్‌ఓఎఫ్‌)ను వినియోగించుకోవచ్చు. ఈ పారదర్శక వ్యవస్థ కారణంగా వినియోగదారు సమాచారం లీక్‌ కాదు. చెల్లింపుల ప్రక్రియ వేగంగా జరుగుతుంది.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని