కార్ల మరమ్మతు కేంద్రాలను ఏర్పాటు చేయనున్న కార్స్‌24
close

Updated : 21/10/2021 12:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కార్ల మరమ్మతు కేంద్రాలను ఏర్పాటు చేయనున్న కార్స్‌24

దిల్లీ: ఆన్‌లైన్‌లో వినియోగ కార్ల క్రయవిక్రయాలను నిర్వహించే కార్స్‌24 సొంతంగా మరమ్మతు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధం అవుతోంది. దేశ వ్యాప్తంగా మెగా రీఫర్‌బిష్‌మెంట్‌ ల్యాబ్స్‌ (ఎంఆర్‌ఎల్‌)ను మెట్రో నగరాల్లో దాదాపు 35 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించింది. హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి, బెంగళూరు, అహ్మదాబాద్‌, చెన్నై, పుణేల్లో ఇవి ఉండనున్నాయి. నెలకు 20వేల కార్ల వరకు అవసరమైన మరమ్మతు చేసి, కొనుగోలుదార్లకు అందుబాటులో ఉంచాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఈ కేంద్రాల వల్ల దాదాపు 1,500 మంది వాహన నిపుణులకు ఉద్యోగాలు లభిస్తాయని సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని