భారత వృద్ధి రేటు 10.5% పైగానే
close

Published : 22/10/2021 03:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత వృద్ధి రేటు 10.5% పైగానే

 ప్రస్తుత ఆర్థిక సంవత్సరంపై నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌

దిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10.5 శాతం లేదా అంతకుమించి వృద్ధి రేటును నమోదుచేసే అవకాశం ఉందని నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. ప్రజా వ్యవహారాల ఫోరమ్‌ (పీఏఎఫ్‌ఐ) నిర్వహించిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రిటైల్‌ రంగంలో కొత్త మార్పులు శరవేగంగా వస్తున్నాయని తెలిపారు. తయారీ, సేవా రంగాల పీఎంఐ సూచీ  గణనీయంగా పుంజుకుందని, ఆర్థిక వ్యవస్థ మరింతగా బలోపేతం అవుతోందని పేర్కొన్నారు. వివిధ రంగాల్లో గిరాకీ పరిస్థితులు సమానంగా లేకపోవడం వినియోగదార్లలో విశ్వాసలేమి వల్ల కాదని, సరఫరా అవరోధాలు లాంటి ఇతర కారణాలూ దోహదం చేస్తున్నాయని చెప్పారు. ఇవి భారత వృద్ధి పుంజుకోవడాన్ని నియంత్రిస్తున్నాయని తెలిపారు. ఎగుమతుల వాటాను రెట్టింపు చేసుకుంటే..ఆ పరిణామం ఉద్యోగాల సృష్టికి ఉపయోగపడుతుందని వివరించారు. ప్రభుత్వంతో కలిసి దేశ ఆర్థిక వ్యవస్థను ప్రైవేట్‌ రంగం ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ప్రభుత్వ ఉద్దేశాలను పారిశ్రామికవేత్తలు సరైన కోణంలో చూడాలని, ఇప్పటికే ఎన్నో సాహసోపేత నిర్ణయాలను ప్రభుత్వం తీసుకున్న విషయాన్ని రాజేశ్‌ కుమార్‌ గుర్తు చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని