ఆరోగ్య సంరక్షణపై ప్రభుత్వ వ్యయాలు రెట్టింపవ్వాలి
close

Published : 22/10/2021 03:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆరోగ్య సంరక్షణపై ప్రభుత్వ వ్యయాలు రెట్టింపవ్వాలి

జీడీపీలో 2.5- 3.5 శాతం వరకు

 ఫిక్కీ, కేపీఎంజీ నివేదిక

దిల్లీ: ప్రజల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వ వ్యయాలు పెరగాల్సి ఉందని ఫిక్కీ-కేపీఎంజీ నివేదిక సూచించింది. ప్రస్తుతం జీడీపీలో 1.2 శాతాన్నే ఇందుకు వెచ్చిస్తుండగా, దీన్ని రెట్టింపు-మూడింతలు  (2.5- 3.5 శాతం) చేయాల్సి ఉందని వివరించింది. ‘కొవిడ్‌-19 ఇండ్యూస్డ్‌ హెల్త్‌కేర్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ ఇన్‌ ఇండియా’ పేరిట ఈ నివేదికను విడుదల చేశారు. కొవిడ్‌ పరిణామాలతో భారత్‌ సంప్రదాయ వ్యవస్థల నుంచి క్లౌడ్‌ ఆధారిత అప్లికేషన్‌లకు మారిందని, ప్రపంచవ్యాప్తంగా డిజిటల్‌ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను అందిపుచ్చుకోవడానికి ఈ సంక్షోభం ఉత్ప్రేరకంగా పనిచేసిందని నివేదిక అభిప్రాయపడింది. 2018-19లో ఆరోగ్య సంరక్షణ కోసం జీడీపీలో 1.5 శాతం ఖర్చుచేశారు. ఆరోగ్య రంగంలో ఆర్థిక లోటును పూడ్చేందుకు ప్రత్యామ్నాయ ఫైనాన్స్‌ విధానాలను అవలంబించాలని, అందరికీ ఆరోగ్య భద్రత తప్పనిసరి చేయాలని పేర్కొంది. ఆరోగ్య వ్యవస్థ పరిణితి మదింపునకు జిల్లా స్థాయిల్లో ఆరోగ్య వ్యవస్థ సూచీని ఏర్పాటు చేయాలని సూచించింది.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని