ఎంఎస్‌ఎంఈలకు కొవిడ్‌-19 రుణాలు
close

Published : 22/10/2021 03:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎంఎస్‌ఎంఈలకు కొవిడ్‌-19 రుణాలు

 మాస్టర్‌కార్డ్‌, యూఎస్‌ఎయిడ్‌తో జట్టు కట్టిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌

ముంబయి: కొవిడ్‌ ప్రభావం నుంచి వేగంగా కోలుకునేందుకు, దేశంలోని చిన్న వ్యాపారాలకు ప్రోత్సాహం ఇచ్చేందుకు ప్రకటించిన 10 కోట్ల డాలర్ల (సుమారు రూ.750 కోట్లు) రుణాలను గురువారం నుంచి అందిస్తున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ గురువారం వెల్లడించింది. ఇందుకోసం మాస్టర్‌కార్డ్‌, యూఎస్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (యూఎస్‌ఐడీఎఫ్‌సీ), యూఎస్‌ ఏజెన్సీ ఫర్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌లతో (యూఎస్‌ఎయిడ్‌) జట్టు కట్టింది. ఎంఎస్‌ఎంఈల డిజిటలీకరణకు కూడా తోడ్పాటు అందిస్తామని, ముఖ్యంగా మహిళల నేతృత్వంలోని సంస్థలకు ప్రాధాన్యం ఇస్తామని పేర్కొంది. కొత్తగా రుణాలు తీసుకునే వారికే ఈ సదుపాయం ఉంటుందని, ఇందులో 50 శాతం రుణాలు మహిళా వ్యాపారవేత్తలకు అందివ్వనున్నట్లు వివరించింది.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని