ఐడీబీఐ బ్యాంక్‌ లాభం రూ.567 కోట్లు
close

Published : 22/10/2021 03:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఐడీబీఐ బ్యాంక్‌ లాభం రూ.567 కోట్లు

దిల్లీ: ఎల్‌ఐసీ నియంత్రణలోని ఐడీబీఐ బ్యాంక్‌ సెప్టెంబరు త్రైమాసికంలో రూ.567 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2020-21 ఇదే  త్రైమాసిక లాభం రూ.324 కోట్లతో పోలిస్తే ఇది 75 శాతం ఎక్కువ. మొత్తం ఆదాయం రూ.5,569.35 కోట్ల నుంచి 10 శాతం తగ్గి రూ.5,000.64 కోట్లకు పరిమితమైంది. నికర వడ్డీ ఆదాయం మాత్రం రూ.1,695 కోట్ల నుంచి 9 శాతం పెరిగి రూ.1,854 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్‌ 2.70 శాతం నుంచి 32 బేసిస్‌ పాయింట్లు పెరిగి 3.02 శాతానికి చేరింది. స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు) 25.08 శాతం నుంచి 20.92 శాతానికి,   నికర ఎన్‌పీఏలు 2.67 శాతం నుంచి 1.62 శాతానికి మెరుగయ్యాయి. మొండి బకాయిలు, ఆకస్మిక నిధికి కేటాయింపులు రూ.389.44 కోట్ల నుంచి రూ.434.47 కోట్లకు చేరాయి. šసాంకేతిక రైటాఫ్‌లతో కలిపి కేటాయింపుల కవరేజీ నిష్పత్తి 95.96 శాతం నుంచి 97.27 శాతంగా నమోదైంది. సమీక్షా త్రైమాసికంలో రూ.1,438 కోట్లు మొండి బకాయిలుగా మారగా, రూ.1,788 కోట్ల రుణాలు రికవరీ అయ్యాయని బ్యాంక్‌ పేర్కొంది. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ పరిష్కార ప్రణాళికలో రూ.200 కోట్లు తిరిగొచ్చినట్లు తెలిపింది. శ్రేయీ గ్రూప్‌నకు జారీ చేసిన రూ.400 కోట్ల రుణాలు ఎన్‌పీఏలుగా మారాయని, ఈ ఖాతాకు 100 శాతం కేటాయింపులు చేసినట్లు తెలిపింది. సీఆర్‌ఏఆర్‌ (క్యాపిటల్‌ టు రిస్క్‌ (వెయిటెడ్‌) అసెట్స్‌ రేషియో) 13.67 శాతం నుంచి 16.59 శాతానికి మెరుగైనట్లు వివరించింది.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని