గెయిల్‌.. అతిపెద్ద హరిత హైడ్రోజన్‌ ప్లాంట్‌
close

Published : 22/10/2021 03:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గెయిల్‌.. అతిపెద్ద హరిత హైడ్రోజన్‌ ప్లాంట్‌

 రోజుకు 4.5 టన్నుల ఉత్పత్తి లక్ష్యం

సీఎండీ మనోజ్‌ జైన్‌

దిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ గెయిల్‌ (ఇండియా) దేశంలోనే అతిపెద్ద హరిత హైడ్రోజన్‌ తయారీ ప్లాంటును నిర్మించనుంది. గురువారం సెరావీక్‌ ఆధ్వర్యంలో జరిగిన ‘ఇండియా ఎనర్జీ ఫోరమ్‌’లో గెయిల్‌ సీఎండీ మనోజ్‌ జైన్‌ మాట్లాడుతూ ‘10 మెగావాట్‌ ఎలక్ట్రోలైజర్‌ సామర్థ్యంతో రోజుకు 4.5 టన్నుల హరిత హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసేలా ప్లాంటు నిర్మిస్తామ’ని వెల్లడించారు. ‘ఎలక్ట్రోలైజర్‌ కొనుగోలుకు అంతర్జాతీయ టెండర్‌ను ప్రకటించాం. ప్లాంటు నిర్మాణానికి 12-14 నెలల సమయం పట్టొచ్చు. ఇప్పటికే యూనిట్‌ కోసం 2-3 స్థలాలను ఎంపికచేశాం. అందులో కంపెనీకి గ్యాస్‌ ప్రాసెసింగ్‌ ప్లాంటు ఉన్న మధ్యప్రదేశ్‌లోని విజయపూర్‌ కూడా ఉంది’ అని చెప్పుకొచ్చారు. భారత్‌లో ఇప్పటిదాకా ప్రకటించిన వాటిలో ఇదే అతిపెద్దదని ఆయన అన్నారు. ఎన్‌టీపీసీ ఇటీవల ప్రకటించిన 5 మెగావాట్ల హరిత హైడ్రోజన్‌ ప్లాంటుతో పోలిస్తే రెట్టింపు సామర్థ్యం దీని సొంతమన్నారు. ఐఓసీ కూడా మధుర రిఫైనరీ వద్ద ఒక హరిత హైడ్రోజన్‌ ప్లాంటును నిర్మించనున్నట్లు ప్రకటించింది.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని