67% పెరిగిన తాన్లా ప్లాట్‌ఫామ్స్‌ లాభం
close

Published : 22/10/2021 03:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

67% పెరిగిన తాన్లా ప్లాట్‌ఫామ్స్‌ లాభం

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌కు చెందిన తాన్లా ఫ్లాట్‌ఫామ్స్‌ సెప్టెంబరు త్రైమాసికానికి ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించింది. ఆదాయం  44 శాతం వృద్ధితో రూ.841.60 కోట్లకు చేరుకుంది. స్థూల లాభం 71 శాతం, నికరలాభం 67 శాతం పెరిగాయి. నికరలాభం రూ.136.2 కోట్లు, ఈపీఎస్‌ 10.04గా నమోదైనట్లు కంపెనీ వెల్లడించింది. ప్రస్తుత వినియోగదార్ల నుంచి అధిక ఆదాయాలు లభించడంతో పాటు వివిధ విభాగాల్లో తమ మార్కెట్‌ వాటా పెంచుకున్నట్లు తాన్లా ప్లాట్‌ఫామ్స్‌ ఛైర్మన్‌, సీఈఓ ఉదయ్‌ రెడ్డి పేర్కొన్నారు. సెప్టెంబరు త్రైమాసికంలో 87 మంది ఖాతాదార్లు లభించగా, కొత్తగా 111 మంది ఉద్యోగులను నియమించినట్లు తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని