జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ లాభం నాలుగింతలు
close

Published : 22/10/2021 03:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ లాభం నాలుగింతలు

దిల్లీ: సెప్టెంబరు త్రైమాసికంలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ ఏకీకృత ప్రాతిపదికన రూ.7,179 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2020-21 ఇదే త్రైమాసిక లాభం రూ.1,595 కోట్లతో పోలిస్తే ఇది నాలుగింతలు అధికం. మొత్తం ఆదాయం రూ.19,416 కోట్ల నుంచి రూ.33,449 కోట్లకు వృద్ధి చెందడం  కలిసొచ్చిందని కంపెనీ తెలిపింది. ఇదే సమయంలో మొత్తం వ్యయాలు రూ.16,958 కోట్ల నుంచి రూ.24,261 కోట్లకు చేరాయి. ముడి ఉక్కు ఉత్పత్తి 3.85 మిలియన్‌ టన్నుల నుంచి 4.10 మి.ట.కు చేరింది. అమ్మకాలు 4.12 మి.ట. నుంచి 8 శాతం తగ్గి 3.79 మి.ట.కు చేరాయి.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని