అరామ్‌కో ఛైర్మన్‌ నియామకానికి వాటాదార్ల ఆమోదం
close

Published : 22/10/2021 03:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అరామ్‌కో ఛైర్మన్‌ నియామకానికి వాటాదార్ల ఆమోదం

దిల్లీ: సౌదీ అరామ్‌కో ఛైర్మన్‌ యాసిర్‌ అల్‌ రుమయ్యన్‌ను కంపెనీ బోర్డులో నియమించడానికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) వాటాదార్లు ఆమోదముద్ర వేశారు. ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా 2 శాతం లోపు ఓట్లు రావడం గమనార్హం. నియామకానికి సంబంధించిన వాటాదార్ల ఓట్ల పలితాలను ఎక్స్ఛేంజీలకు కంపెనీ వెల్లడించింది. రుమయ్యన్‌ను మూడేళ్ల పాటు బోర్డులో నియమించుకోడానికి అనుకూలంగా 98.03 శాతం ఓట్లు వచ్చాయని అందులో తెలిపింది. 10.89 కోట్ల షేర్లు లేదా 1.96% ఓట్లు వ్యతిరేకంగా రాగా.. 3.23 కోట్ల ఓట్లు చెల్లుబాటు కాలేదని వివరించింది. రిలయన్స్‌లో వాటాదారైన ద కాలిఫోర్నియా స్టేట్‌ టీచర్స్‌ రిటైర్‌మెంట్‌ సిస్టమ్‌(కాల్‌ఎస్‌టీఆర్‌ఎస్‌) ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఓటేయాలని గత నెలలో నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని