బీఎండబ్ల్యూ 5 సిరీస్‌ ఎం స్పోర్ట్‌  ‘కార్బన్‌ ఎడిషన్‌’ @ 66.3 లక్షలు
close

Updated : 22/10/2021 06:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బీఎండబ్ల్యూ 5 సిరీస్‌ ఎం స్పోర్ట్‌  ‘కార్బన్‌ ఎడిషన్‌’ @ 66.3 లక్షలు

దిల్లీ: జర్మన్‌ విలాస కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ కొత్తగా 5 సిరీస్‌లో ఎం స్పోర్ట్‌ ‘కార్బన్‌ ఎడిషన్‌’ను దేశీయ విపణిలోకి తీసుకొచ్చింది. దీని ధర రూ.66.3 లక్షలు. చెన్నై ప్లాంటులో ఉత్పత్తి అయిన ఈ కార్లను గురువారం నుంచి (21న) ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ‘ప్రీమియం ఎగ్జిక్యూటివ్‌ సెడాన్‌ కార్లలో అత్యంత విజయవంతమైన మోడళ్లలో బీఎండబ్ల్యూ 5 సిరీస్‌ ఒకటని బీఎండబ్ల్యూ గ్రూప్‌ ఇండియా ప్రెసిడెంట్‌ విక్రమ్‌ పావ్‌ వెల్లడించారు. బీఎండబ్ల్యూ 530ఐ, 2-లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌తో రూపొందిన ఈ కారు గరిష్ఠంగా 252 హెచ్‌పీ, 350 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6.1 సెకన్లలోనే 100 కి.మీ గరిష్ఠ వేగాన్ని అందుకుంటుంది. రిమోట్‌ కంట్రోల్‌ పార్కింగ్‌, రివర్సింగ్‌ అసిస్టెంట్‌, పార్కింగ్‌ అసిస్టెంట్‌, వర్చువల్‌ అసిస్టెంట్‌, సంజ్ఞలతో నియంత్రణ, 360 డిగ్రీల సరౌండ్‌ కెమెరా వంటి మల్టిపుల్‌ డ్రైవర్‌ అసిస్టెన్స్‌ సిస్టమ్స్‌ ఇందులో ఉన్నాయి.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని