విస్తారా విమానాల్లో మళ్లీ భోజన సదుపాయం
close

Published : 22/10/2021 03:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విస్తారా విమానాల్లో మళ్లీ భోజన సదుపాయం

దిల్లీ: దేశీయ మార్గాల్లో ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించే వారికి మళ్లీ భోజన సదుపాయాన్ని విస్తారా ప్రారంభించింది. కొవిడ్‌-19 మార్గదర్శకాల నేపథ్యంలో గతేడాది మే నుంచి ప్యాకేజ్డ్‌ స్నాక్స్‌నే విమానాల్లో అందిస్తున్నారు. ప్రస్తుతం కొవిడ్‌-19 పరిస్థితులు కొంత మేర అదుపులోకి రావడం, చాలా మంది ప్రయాణికులకు టీకా రెండు డోసులు పూర్తవ్వడం, విమానాల్లో భోజనం చేసేందుకు వారు సుముఖంగా ఉన్నట్లు తమ తాజా సర్వేలో తేలినందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ అధికారి  వెల్లడించారు.   గురువారం నుంచి ఎకానమీ క్లాస్‌ ప్రయాణికులకు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేడివేడి ఆహార  పదార్థాలు అందివ్వడాన్ని తిరిగి ప్రారంభిస్తున్నామని తెలిపింది. వినియోగదారుల అభిరుచికి తగ్గట్లుగా స్నాక్స్‌ మెనూ కూడా ఉండనుందని పేర్కొంది. ఎకానమీ, ప్రీమియమ్‌ ఎకానమీ, బిజనెస్‌ క్లాస్‌ ప్రయాణికులకు ఆహార పదార్థాల మెనూను కూడా మార్చనున్నట్లు విస్తారా పేర్కొంది.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని