సంక్షిప్త వార్తలు
close

Published : 22/10/2021 03:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సంక్షిప్త వార్తలు

సిగ్నిటీ లాభం రూ.22 కోట్లు

ఈనాడు, హైదరాబాద్‌: సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్‌, క్వాలిటీ ఇంజినీరింగ్‌ సేవల సంస్థ సిగ్నిటీ టెక్నాలజీస్‌ సెప్టెంబరు త్రైమాసికంలో రూ.307.90 కోట్ల ఆదాయాన్నీ, రూ.22.17 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2020-21 ఇదే త్రైమాసికంలో ఆదాయం రూ.221.20 కోట్లు, నికర లాభం రూ.25.22 కోట్లుగా ఉన్నాయి. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎగుమతుల ఇన్సెంటివ్‌ల మొత్తం రూ.9.74 కోట్లను రద్దు చేయడంతో నికర లాభం క్షీణించిందని పేర్కొంది. రెండో త్రైమాసికంలో కొత్త పరిష్కారాలు అందించడం ద్వారా ఆదాయం పెరిగిందని సంస్థ సీఎండీ సీవీ సుబ్రమణ్యం పేర్కొన్నారు.


3-4 ఏళ్లలో 600 సీఎన్‌జీ స్టేషన్లు

‘పైలట్‌ ప్రాజెక్టు కింద సహజ వాయువులో హైడ్రోజన్‌ను కలపడాన్ని మొదలుపెట్టాం. దీన్ని పెద్దఎత్తున తయారు చేయడానికి ముందు మిశ్రమ శాతం ఎంత అనేదానిపై పరీక్షలు జరుపుతున్నామ’ని జైన్‌ వివరించారు. గెయిల్‌ తయారు చేసే హైడ్రోజన్‌ను ఎరువుల యూనిట్లకు విక్రయిస్తామని తెలిపారు. ‘మార్చి 2022 కల్లా స్వర్ణ చతుర్భుజిలో 20 ఎల్‌ఎన్‌జీ స్టేషన్లను ఏర్పాటు చేస్తాం. మూడు నాలుగేళ్లలో 500-600 అవుట్‌లెట్లను ఏర్పాటు చేస్తాం. మొత్తం మీద లక్ష్యం 1000 ఎల్‌ఎన్‌జీ స్టేషన్ల’ని ఆయన పేర్కొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని