సంక్షిప్త వార్తలు
close

Published : 23/10/2021 01:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సంక్షిప్త వార్తలు

స్టే తొలగింపుపై ఫ్యూచర్‌ విజ్ఞప్తికి తిరస్కారం

దిల్లీ: రిలయన్స్‌ రిటైల్‌తో కుదుర్చుకున్న రూ.24,713 కోట్ల ఒప్పందంపై మధ్యంతర స్టే ఎత్తివేయాలంటూ ఫ్యూచర్‌ రిటైల్‌ చేసుకున్న విజ్ఞప్తిని సింగపూర్‌కు చెందిన మధ్యవర్తిత్వ కోర్టు ఎస్‌ఐఏసీ తిరస్కరించింది. అమెజాన్‌, ఫ్యూచర్‌ గ్రూప్‌ మధ్య జరుగుతున్న మధ్యవర్తిత్వ కేసులో ఫ్యూచర్‌ రిటైల్‌ కూడా భాగమేనని ఎస్‌ఐఏసీ తీర్పునిచ్చిన ఒక రోజు అనంతరం ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. ఫ్యూచర్‌ కూపన్‌, అమెజాన్‌ల మధ్య జరుగుతున్న ఈ వివాదంలో తాము భాగం కాలేమని.. ఈ ప్రక్రియ నుంచి తొలగించమని చెబుతూ ఫ్యూచర్‌రిటైల్‌ అంతక్రితం విజ్ఞప్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఫ్యూచర్‌ రిటైల్‌ ఆస్తుల విక్రయం లేదా నిధుల కోసం సెక్యూరిటీలు జారీ చేయొద్దంటూ అక్టోబరు 25, 2020న ఎమర్జెన్సీ ఆర్బిట్రేటర్‌(ఈఏ) జారీ చేసిన మధ్యవర్తిత్వ తీర్పును రద్దు చేయాలని కోరుతూ చేసుకున్న విజ్ఞప్తిపై అక్టోబరు 21, 2021న ఎస్‌ఐఏసీ నిర్ణయం వచ్చిందని శుక్రవారం ఫ్యూచర్‌ రిటైల్‌ ఎక్స్ఛేంజీలకు సమాచారం ఇచ్చింది.  


ఐటీ వెబ్‌సైట్‌లో నేడు అంతరాయం

ఈనాడు, హైదరాబాద్‌: నిర్వహణ పరమైన పనుల్లో భాగంగా ఆదాయపు పన్ను వెబ్‌సైట్‌ దాదాపు 12 గంటలపాటు నిలిచిపోనుంది. శనివారం రాత్రి 10 గంటల నుంచి ఆదివారం ఉదయం 10 గంటల వరకు సేవలు అందుబాటులో ఉండవని ఆదాయపు పన్ను విభాగం తన వెబ్‌సైటు https:/// www.incometax.gov.in   లో ప్రకటించింది. ఈ సమయంలో ఇ-ఫైలింగ్‌ పోర్టల్‌ ద్వారా రిటర్నులు సమర్పించడం సాధ్యం కాదు.  ఈ వెబ్‌సైటులో ఇతర సేవలూ అందుబాటులో ఉండవు.  


మొబైల్‌ రీఛార్జులపై ఫోన్‌పే రుసుము

దిల్లీ: వాల్‌మార్ట్‌ గ్రూప్‌నకు చెందిన డిజిటల్‌ చెల్లింపుల సంస్థ ఫోన్‌పే, ఫోన్‌ రీఛార్జులపై ప్రాసెసింగ్‌ రుసుమును వసూలు చేయడం ప్రారంభించింది.రూ.50 లోపు ఫోన్‌ రీఛార్జులపై రుసుములు ఉండవని, రూ.50-100 రీఛార్జులపై రూ.1, రూ.100 దాటితే రూ.2 రుసుమును ప్రయోగాత్మకంగా వసూలు చేయనున్నట్లు ఫోన్‌పే అధికార ప్రతినిధి వెల్లడించారు. రీఛార్జి లావాదేవీ యూపీఐ ద్వారా చేసినా, ప్రాసెసింగ్‌ రుసుము భారం పడుతుంది. యూపీఐ ఆధారిత లావాదేవీలపై ఛార్జీలు విధించడం ప్రారంభించిన మొదటి డిజిటల్‌ చెల్లింపుల సంస్థగా ఫోన్‌పే నిలవనుంది.


హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ లాభం రూ.276 కోట్లు

దిల్లీ: హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సెప్టెంబరు త్రైమాసికానికిరూ.275.91 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. 2020-21 ఇదే త్రైమాసిక లాభం రూ.327.83 కోట్లతో పోలిస్తే, ఇది 16% తక్కువ. మొత్తం ఆదాయం రూ.16,426.03 కోట్ల నుంచి రూ.20,478.46 కోట్లకు పెరిగింది. నికర ప్రీమియం ఆదాయం రూ.10056.71 కోట్ల నుంచి రూ.11445.53 కోట్లకు చేరింది.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని