పీవీఆర్‌కు తగ్గిన నష్టం
close

Published : 23/10/2021 05:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పీవీఆర్‌కు తగ్గిన నష్టం

దిల్లీ: మల్టీప్లెక్స్‌ల నిర్వాహక సంస్థ పీవీఆర్‌ లిమిటెడ్‌  సెప్టెంబరు త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.153.13 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. 2020-21 ఇదే త్రైమాసిక నష్టం రూ.184.06 కోట్లతో పోలిస్తే ఈసారి తగ్గింది. కార్యకలాపాల ఆదాయం రూ.40.45 కోట్ల నుంచి మూడు రెట్లు పెరిగి రూ.120.32 కోట్లకు చేరింది. గత సంవత్సరం జులై- సెప్టెంబరులో థియేటర్లను పూర్తిగా మూసివేయడం వల్లే ఆ సమయంలో ఆదాయంగా తక్కువగా ఉందని పేర్కొంది. ఏడాది వ్యవధిలో వ్యయాలు రూ.389.37 కోట్ల నుంచి 18.31 శాతం పెరిగి రూ.460.68 కోట్లకు చేరాయి. ‘కొవిడ్‌-19 రెండో దశ ప్రభావం జులై- సెప్టెంబరు త్రైమాసికంపైనా కొనసాగింది. అయితే వ్యయ నియంత్రణ చర్యలు, బ్యాలెన్స్‌ షీట్ల పటిష్ఠతకు తగినంత నిధుల లభ్యత ఉండటంతో, ఆ ప్రభావాన్ని పరిమితం చేసుకున్నామ’ని పీవీఆర్‌ వెల్లడించింది.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని