బయోకాన్‌ లాభంలో 18% క్షీణత
close

Published : 23/10/2021 01:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బయోకాన్‌ లాభంలో 18% క్షీణత

దిల్లీ: సెప్టెంబరు 30తో ముగిసిన త్రైమాసికానికి బయోకాన్‌ ఏకీకృత పద్ధతిలో రూ.138 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2020-21 ఇదే త్రైమాసిక లాభం రూ.169 కోట్లతో పోలిస్తే ఈసారి 18 శాతం తగ్గింది. అయితే కార్యకలాపాల ఆదాయం రూ.1,750 కోట్ల నుంచి రూ.1,840 కోట్లకు పెరిగిందని కంపెనీ తెలిపింది. అనుకోని అవసరాల కోసం కొంత కేటాయింపులు చేయడం వల్ల లాభం తగ్గిందని పేర్కొంది. ఈ కేటాయింపులను మినహాయిస్తే.. లాభం రూ.188 కోట్లుగా లెక్క తేలుతుందని, ఏడాదిక్రితంతో పోలిస్తే ఇది 11 శాతం ఎక్కువ అని కంపెనీ పేర్కొంది. కొవిడ్‌-19 ప్రతికూలతలు తగ్గుముఖం పట్టడం, సరఫరా పరిస్థితులు మెరుగవ్వడంతో తమ మూడు వ్యాపార (జెనరిక్స్‌, బయోసిమిలర్స్‌, పరిశోధన సేవలు) విభాగాల్లో స్థిరమైన వృద్ధి కొనసాగుతుందని భావిస్తున్నామని బయోకాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌ షా తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని