55% పెరిగిన ఫెడరల్‌ బ్యాంక్‌ లాభం
close

Published : 23/10/2021 01:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

55% పెరిగిన ఫెడరల్‌ బ్యాంక్‌ లాభం

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఫెడరల్‌ బ్యాంక్‌ ఏకీకృత ప్రాతిపదికన రూ.488 కోట్ల లాభాన్ని నమోదుచేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసిక లాభం రూ.315.70 కోట్లతో పోలిస్తే ఈసారి 55 శాతం వృద్ధి ఉంది. అయితే మొత్తం ఆదాయం రూ.4,071.35 కోట్ల నుంచి తగ్గి రూ.4,013.46 కోట్లకు పరిమితమైంది. స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి 2.8 శాతం నుంచి 3.22 శాతానికి, నికర నిరర్థక ఆస్తులు 0.99 శాతం నుంచి 1.15 శాతానికి పెరిగాయి. విలువ ప్రకారం చూస్తే.. స్థూల ఎన్‌పీఏలు రూ.3,591.72 కోట్ల నుంచి రూ.4,558.19 కోట్లకు, నికర నిరర్థక ఆస్తులు  రూ.1,249.85 కోట్ల నుంచి పెరిగి రూ.1,595.78 కోట్లకు చేరాయి. మొండి బకాయిలు ఇతరత్రా అవసరాల కోసం కేటాయింపులు రూ.264.53 కోట్లకు పరిమితమయ్యాయి. ఏడాదిక్రితం ఇదే సమయంలో కేటాయింపులు రూ.565.46 కోట్లుగా నమోదయ్యాయి.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని