ఎన్‌బీఎఫ్‌సీలూ..రికవరీల్లో కఠినత్వం వద్దు
close

Published : 23/10/2021 01:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎన్‌బీఎఫ్‌సీలూ..రికవరీల్లో కఠినత్వం వద్దు

వినియోగదార్ల ప్రయోజనాలకే పెద్ద పీట
ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ ఎం. రాజేశ్వర్‌ రావు

దిల్లీ: బ్యాంకింగేతర ఆర్థిక కంపెనీ(ఎన్‌బీఎఫ్‌సీ)ల్లో బాధ్యతాయుత పాలనా సంప్రదాయాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ ఎం. రాజేశ్వర్‌ రావు నొక్కిచెప్పారు. వినియోగదార్ల సంరక్షణ, ప్రయోజనాలనేవి చర్చించడానికి వీల్లేని అంశాలు కాబట్టి.. వాటికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఎన్‌బీఎఫ్‌సీలకు సూచించారు. కొన్ని కంపెనీలు రికవరీల విషయంలో కఠిన ధోరణిని ప్రదర్శించడాన్ని ఆయన గుర్తు చేశారు. లాభాలను మాత్రమే దృష్టిలో పెట్టుకుని అలా వ్యవహరిస్తే, మొత్తం వ్యవస్థపై విశ్వాసం కోల్పోయే అవకాశం ఉందని అన్నారు. ‘అశాశ్వతమైన లాభాల కోసం ఆర్థిక నైతికత విషయంలో రాజీ పడకూడదని నేను కోరుతున్నా. దీర్ఘకాలంలో లాభాలు ఎలాగూ సంపాదించవచ్చు. వినియోగదార్లకు ఒక్కసారి విశ్వాసం కలిగితే అది పరస్పర ప్రయోజనాలను అందిస్తుందని గుర్తుంచుకోవాల’ని సీఐఐ ఆధ్వర్యంలో జరిగిన ఎన్‌బీఎఫ్‌సీ సదస్సులో ఆయన వివరించారు. ‘రికవరీ విషయంలో దారుణంగా వ్యవహరిస్తున్నారని, డేటా గోప్యతకు తూట్లు పొడుస్తున్నారనీ, మోసపూరిత లావాదేవీలు పెరుగుతున్నాయని, అధిక వడ్డీరేట్లకు తోడు వేధింపులూ పెరుగుతున్నాయని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని తెలిపారు. ఇటీవలి వైఫల్యాల వల్ల ఎన్‌బీఎఫ్‌సీ రంగ ప్రతిష్ఠ మసకబారింది. ఇపుడు తిరిగి పునరుద్ధరించుకోవడమే ముఖ్యమని ఆయన సూచించారు. మొత్తం దేశంలో 12 విభాగాల్లో 9,651 ఎన్‌బీఎఫ్‌సీలున్నాయి. మార్చి 31, 2021 నాటికి ఎన్‌బీఎఫ్‌సీ రంగం కింద రూ.54 లక్షల కోట్ల ఆస్తులున్నాయి. బ్యాంకింగ్‌ రంగ ఆస్తులతో పోలిస్తే ఇవి నాలుగో వంతు.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని