విద్యాసాంకేతికత రాజధానిగా భారత్‌
close

Published : 23/10/2021 01:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విద్యాసాంకేతికత రాజధానిగా భారత్‌

నీతి ఆయోగ్‌ సీఈఓ అమితాబ్‌ కాంత్‌

దిల్లీ: ప్రపంచ విద్యాసాంకేతికత (ఎడ్‌టెక్‌) రాజధానిగా భారత్‌ మారేందుకు అవకాశాలున్నాయని నీతి ఆయోగ్‌ సీఈఓ అమితాబ్‌ కాంత్‌ పేర్కొన్నారు. ఇందులో ప్రైవేటు రంగం కీలక పాత్ర పోషిస్తుండగా.. ప్రభుత్వ రంగం నుంచి సహకారం అందుతోందని శుక్రవారమిక్కడ జరిగిన పబ్లిక్‌ అఫైర్స్‌ ఫోరమ్‌ ఆఫ్‌ ఇండియా(పఫి) సదస్సులో ఆయన చెప్పారు. ‘అందుబాటు ధరలో ఇంటర్నెట్‌, సాంకేతికతతో కూడిన మౌలిక వసతులే దేశంలో విద్యా రంగాన్ని విస్తరించగలవు. ఎడ్‌ టెక్‌తో విద్యార్థులు నేర్చుకునే విధానం మెరుగుపడుతుంది. భారత్‌లో డిజిటల్‌ అంతరం తగ్గుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో విప్లవాన్ని తీసుకురావొచ్చు’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

‘2030 కల్లా రూ.75 లక్షల కోట్లకు స్థిరాస్తి రంగం’: ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో స్థిరాస్తి రంగం కీలక పాత్ర పోషిస్తోందని.. 2030 కల్లా ఇది లక్ష కోట్ల డాలర్ల (దాదాపు రూ.75 లక్షల కోట్లు)కు చేరుకుంటుందని అమితాబ్‌ కాంత్‌ అంచనా వేశారు. ఇది భారత జీడీపీలో 18-20 శాతం వాటా అని అన్నారు. సెబీ ఇప్పటికే రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్స్‌(రీట్స్‌)కు ఆమోదం తెలిపిన నేపథ్యంలో రాబోయే సంవత్సరాల్లో రూ.1.25 లక్షల కోట్ల అవకాశాలను సృష్టించొచ్చని అన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని