గ్లాండ్‌ ఫార్మాకు రూ.302 కోట్ల లాభం
close

Published : 23/10/2021 01:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గ్లాండ్‌ ఫార్మాకు రూ.302 కోట్ల లాభం

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న గ్లాండ్‌ ఫార్మా ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.1,080 కోట్ల ఆదాయాన్ని, రూ.302 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదేకాలంలో ఆదాయం రూ.831 కోట్లు, నికరలాభం రూ.218 కోట్లు మాత్రమే. దీంతో పోల్చితే ఈసారి ఆదాయం 30 శాతం, నికరలాభం 38 శాతం పెరిగినట్లు అవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధానికి ఆదాయం రూ.2,234 కోట్లు ఉండగా, దీనిపై రూ.652 కోట్ల నికరలాభం నమోదైంది. రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలపై గ్లాండ్‌ ఫార్మా ఎండీ శ్రీనివాస్‌ సాదు స్పందిస్తూ విస్తృత శ్రేణి ఔషధాలు ఉత్పత్తి చేయడం వల్ల ఆకర్షణీయ వృద్ధి నమోదు చేసే అవకాశం ఏర్పడినట్లు పేర్కొన్నారు. సొంత ఆర్‌అండ్‌డీ తో కొత్త ఔషధాలు ఆవిష్కరిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే నాలుగు ఇంజెక్టబుల్‌ ఔషధాలకు అనుమతి కోసం దరఖాస్తు చేయనున్నట్లు వివరించారు.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని