ఐటీ, ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లకు అమ్మకాలు
close

Published : 23/10/2021 01:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఐటీ, ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లకు అమ్మకాలు

నాలుగో రోజూ సూచీలు డీలా
సమీక్ష

వరుసగా నాలుగో రోజూ సూచీలు నష్టపోయాయి. విదేశీ మదుపర్ల అమ్మకాలకు తోడు కార్పొరేట్‌ కంపెనీల ఫలితాలు నిరుత్సాహపరచడం ఇందుకు కారణం. ఐటీ, ఎఫ్‌ఎమ్‌సీజీ, లోహ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఫలితాల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తత పాటించారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి 3 పైసలు తగ్గి 74.90 వద్ద ముగిసింది.  
*సూచీల వరుస నష్టాలతో మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మార్కెట్‌ విలువ గత నాలుగు రోజుల్లో రూ.10.29 లక్షల కోట్లు ఆవిరై రూ.264.39 లక్షల కోట్లకు చేరింది.
* సెన్సెక్స్‌ ఉదయం 61,044.54 వద్ద లాభాల్లో ప్రారంభమైంది. అనంతరం అదే జోరు కొనసాగిస్తూ.. ఇంట్రాడేలో 61,420.13 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది.లాభాల స్వీకరణతో నష్టాల్లోకి జారుకున్న సూచీ.. ఒకానొకదశలో    60,551.15 పాయింట్ల వద్ద కనిష్ఠానికి చేరింది. చివరకు 101.88 పాయింట్ల నష్టంతో 60,821.62 వద్ద ముగిసింది. నిఫ్టీ 63.20 పాయింట్లు కోల్పోయి 18,114.90 దగ్గర స్థిరపడింది.

* సెప్టెంబరు త్రైమాసికంలో లాభం తగ్గడంతో బయోకాన్‌ షేరు ఇంట్రాడేలో 6.54% తగ్గి, రూ.322.50 వద్ద 52 వారాల కనిష్ఠాన్ని తాకింది. చివరకు 6.13% నష్టంతో రూ.323.95 వద్ద ముగిసింది.
* సెన్సెక్స్‌ 30 షేర్లలో 17 నష్టపోయాయి. ఐటీసీ 3.39%, మారుతీ 2.12%, ఇన్ఫోసిస్‌ 1.96%, ఎన్‌టీపీసీ 1.93%, హెచ్‌సీఎల్‌ టెక్‌ 1.45%, టాటా స్టీల్‌ 1.43%, ఎం అండ్‌ ఎం 1.25%, నెస్లే 1.23%, టీసీఎస్‌ 0.94% మేర నీరసించాయి. హెచ్‌డీఎఫ్‌సీ 2.11%, బజాజ్‌ ఆటో 1.65%, కోటక్‌ బ్యాంక్‌ 1.19% లాభపడ్డాయి.
* భారతీ ఎయిర్‌టెల్‌ రూ.21000 కోట్ల రైట్స్‌ ఇష్యూకు 1.43 రెట్ల స్పందన లభించింది. రూ.5 ముఖవిలువ కలిగిన ఒక్కో షేరును రూ.535 చొప్పున కంపెనీ జారీ చేసింది.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని