28 నుంచి నైకా పబ్లిక్‌ ఇష్యూ
close

Published : 23/10/2021 06:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

28 నుంచి నైకా పబ్లిక్‌ ఇష్యూ

ధరల శ్రేణి రూ.1085- 1125

 

దిల్లీ: నైకా బ్రాండ్‌ పేరుతో సౌందర్య ఉత్పత్తులు విక్రయించే ఎఫ్‌ఎస్‌ఎన్‌ ఇ-కామర్స్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) అక్టోబరు 28న మొదలై నవంబరు 1న ముగియనుంది. ఇందుకు ధరల శ్రేణిగా రూ.1085-1125ను కంపెనీ నిర్ణయించింది. పబ్లిక్‌ ఇష్యూ ద్వారా కంపెనీ రూ.5,352 కోట్లు సమీకరించాలని చూస్తోంది. ముసాయిదా పత్రాల ప్రకారం.. తాజాగా రూ.630 కోట్ల ఈక్విటీ షేర్లను, ఆఫర్‌ ఫర్‌ సేల్‌ పద్ధతిలో 41,972,660 ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు, తాజా వాటాదార్లు విక్రయించనున్నారు. ఇంతకు ముందు తాజా ఇష్యూ పరిమాణం రూ.525 కోట్లుగా ఉంది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో షేర్లను విక్రయిస్తున్న వారిలో ప్రమోటర్‌ సంజయ్‌ నాయర్‌ ఫ్యామిలీ ట్రస్ట్‌,  వాటాదార్లు అయిన టీపీజీ గ్రోత్‌ 4 ఎస్‌ఎఫ్‌, లైట్‌హౌస్‌ ఇండియా ఫండ్‌ 3, లైట్‌హౌస్‌ ఇండియా 3 ఎంప్లాయి ట్రస్ట్‌, యోగేశ్‌ ఏజెన్సీస్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌, జేఎం ఫైనాన్షియల్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కన్సల్టెన్సీ సర్వీసెస్‌ ఉన్నాయి. ఇష్యూ ధరలో గరిష్ఠమైన రూ.1125ను లెక్కలోకి తీసుకుంటే ఈ ఐపీఓ ద్వారా నైకాకు రూ.5,325 కోట్లు రావొచ్చు. ఐపీఓ ద్వారా వచ్చిన నిధులను కొత్త రిటైల్‌ స్టోర్ల ఏర్పాటు, గోదాములు నెలకొల్పడానికి కంపెనీ వినియోగించనుంది. కొంత రుణభారాన్ని సైతం తగ్గించుకోనుంది.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని