చుక్కల మందు టీకాపై
close

Published : 24/10/2021 02:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చుక్కల మందు టీకాపై

రెండో దశ పరీక్షలు పూర్తి

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌-19 వ్యాధి నిరోధానికి భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేస్తున్న, ముక్కు ద్వారా ఇచ్చే చుక్కల మందు టీకా (నాసల్‌ వ్యాక్సిన్‌) పై రెండో దశ క్లినికల్‌ పరీక్షలు దాదాపు పూర్తయ్యాయి. ఈ ప్రయోగాల ఫలితాలు ఎంతో ఆశాజనకంగా ఉన్నట్లు భారత్‌ బయోటెక్‌ సీఎండీ డాక్టర్‌ కృష్ణ ఎల్ల పేర్కొన్నారు. కరోనా వ్యాధి విస్తరించకుండా ఈ టీకా సమర్థంగా అడ్డుకుంటున్నట్లు పరీక్షల్లో తేలిందని అన్నారు. భారత్‌ బయోటెక్‌ నాసల్‌ వ్యాక్సిన్‌ (బీబీవీ154) పై రెండు, మూడు దశల క్లినికల్‌ పరీక్షలు నిర్వహించడానికి కొంతకాలం క్రితం భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) అనుమతి ఇచ్చిన విషయం విదితమే. దీని ప్రకారం పరీక్షలు చేపట్టారు. త్వరలో మూడో దశ పరీక్షలు మొదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోపక్క 2 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్సు గల పిల్లలకు ‘కొవాగ్జిన్‌’ టీకా ఇవ్వడానికి డీసీజీఐ అనుమతి కోసం భారత్‌ బయోటెక్‌ ఎదురుచూస్తోంది.  దీనికి సబ్జెక్టు నిపుణుల కమిటీ ఇంతకు ముందు ఆమోద ముద్ర వేసిన విషయం విదితమే.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని