ఎన్‌పీఏలను ఏమార్చవద్దు
close

Published : 24/10/2021 02:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎన్‌పీఏలను ఏమార్చవద్దు

బ్యాంకులకు ఆర్‌బీఐ హెచ్చరిక

ముంబయి: నిరర్థక ఆస్తులను (ఎన్‌పీఏ) గుర్తించడంలో బ్యాంకులు ఏమాత్రం అలసత్వం చేయొద్దని ఆర్‌బీఐ మరోసారి బ్యాంకులకు హెచ్చరించింది. ఇలాంటి వాటిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు ఆర్‌బీఐ సిద్ధంగా ఉందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. బ్యాంకులు ఇప్పటికే ఎన్‌పీఏలను గుర్తించేందుకు ఆటోమేటెడ్‌ విధానాన్ని అనుసరిస్తున్నప్పటికీ.. కొన్ని రుణాలను మాత్రం ఎన్‌పీఏలుగా పరిగణించకుండా.. సొంతంగా సాధారణ విభాగంలోకి మార్చేస్తున్నాయని ఆర్‌బీఐ గుర్తించింది. ఎన్‌పీఏలను గుర్తించేందుకు ఆటోమేటెడ్‌ విధానాన్ని అనుసరించాలని ఆర్‌బీఐ పదేళ్ల కిందటే ఆదేశాలనిచ్చింది. అయితే,  2019-20 ఆడిట్‌లో కొన్ని బ్యాంకులు దీన్ని సరిగా పాటించడం లేదని తేలింది. దీంతో ఆర్‌బీఐ ఆయా బ్యాంకులకు నోటీసులను జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియనంతా జూన్‌ 30కి ముగించాలని తెలిపినా.. ఆ తర్వాత ఈ గడువును సెప్టెంబరు 30కు పెంచింది. ఇప్పటికే చాలా బ్యాంకులు ఈ విధానానికి మారాయని, కాకపోతే కొన్ని బ్యాంకులు కొన్ని రుణాలను పేర్కొనడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నట్లు ఆ వర్గాలు వివరించాయి. ముఖ్యంగా క్రెడిట్‌ కార్డులు, స్వల్పకాలిక రుణాలకు సంబంధించినవి మినహా మిగతావన్నీ పూర్తయ్యాయని పేర్కొన్నాయి. వాయిదాల చెల్లింపు ఒక రోజు ఆలస్యం జరిగితే.. దానిని సరిదిద్దే అవకాశం ఉంటుంది. ఒకవేళ 90 రోజుల వరకూ చెల్లింపు లేకపోతే దాన్ని ఎన్‌పీఏగా గుర్తించాలి. కొన్ని సహేతుక పరిస్థితుల్లో వాటిని బ్యాంకులు మార్చేందుకు వీలుందని, కొన్ని మినహాయింపులనూ ఆర్‌బీఐ తెలిపింది. బ్యాంకులు ఆటోమేషన్‌ ప్రక్రియ పాటించేలా ఆడిటర్లు చూడాలని ఆర్‌బీఐ తెలిపింది. యెస్‌బ్యాంక్‌, పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర కోఆపరేటివ్‌ బ్యాంక్‌, దీవాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, శ్రేయీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ తదితర సంస్థలు ఎన్‌పీఏలను గుర్తించకుండా, వాటిని ఏమార్చేందుకు ప్రయత్నించినట్లు ఆర్‌బీఐ పేర్కొంది.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని