సంక్షిప్త వార్తలు
close

Published : 24/10/2021 02:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సంక్షిప్త వార్తలు

బయోలాజికల్‌ ఇ కి డీఎఫ్‌సీ రూ.375 కోట్ల సాయం

హైదరాబాద్‌: కొవిడ్‌-19 టీకా తయారీ సామర్థ్యాన్ని పెంచేందుకు బయోలాజికల్‌ ఇ లిమిటెడ్‌కు 5 కోట్ల డాలర్ల (సుమారు రూ.375 కోట్ల) రుణ సదుపాయాన్ని యూఎస్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (డీఎఫ్‌సీ) అందచేయనుంది. ఇందుకు సంబంధించి ఒప్పంద పత్రంపై ఈనెల 25న డీఎఫ్‌సీ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ డేవిడ్‌ మార్చిక్‌, బయోలాజికల్‌ ఇ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మహిమా దాట్ల సంతకాలు చేయనున్నారు.


ప్లే స్టోర్‌ కమీషన్‌ సగానికి తగ్గించిన గూగుల్‌

దిల్లీ: వచ్చే ఏడాది జనవరి 1 నుంచి గూగుల్‌ ప్లేలోని సబ్‌స్క్రిప్షన్లపై కమీషన్‌ను 30% నుంచి 15 శాతానికి తగ్గించనున్నట్లు గూగుల్‌ ప్రకటించింది. యాప్‌ స్టోర్‌ కమీషన్లు 30 శాతంగా ఉండడంపై యాపిల్‌, గూగుల్‌పై గతంలో డెవలపర్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదురైన సంగతి తెలిసిందే. ‘డెవలపర్ల నిర్దిష్ట అవసరాలకు మద్దతునిచ్చేందు కోసం అన్ని సబ్‌స్క్రిప్షన్లపై సర్వీసు ఫీజులను తగ్గిస్తున్నన్న’ట్లు గూగుల్‌ ఒక బ్లాగ్‌పోస్ట్‌లో స్పష్టం చేసింది. చాలా వరకు డెవలపర్లు తమ యాప్‌లను గూగుల్‌ ప్లేలో ఉచితంగానే పంపిణీ చేయవచ్చని గూగుల్‌ పేర్కొంది. ప్రస్తుతం 97% వరకు డెవలపర్లకు ఎటువంటి ఛార్జీ తీసుకోవడం లేదు. పెయిడ్‌ యాప్‌ లేదా సోల్డ్‌ ఇన్‌-యాప్‌ డిజిటల్‌ గూడ్స్‌ను ఆఫర్‌ చేసే డెవలపర్లకే ఇప్పటిదాకా 30% కమీషన్‌ ఉంటూ వస్తోంది.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని