జౌళి పరికరాల దిగుమతులు తగ్గాలి
close

Published : 25/10/2021 01:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జౌళి పరికరాల దిగుమతులు తగ్గాలి

కేంద్ర మంత్రి పీయూశ్‌ గోయల్‌ పిలుపు

దిల్లీ: ప్రపంచస్థాయిలో 100 భారత జౌళి పరికరాల సంస్థలను అభివృద్ధి చేయాలని కేంద్ర మంత్రి పీయూశ్‌ గోయల్‌ పిలుపునిచ్చారు. ప్రభుత్వం, జౌళి ఇంజినీరింగ్‌ పరిశ్రమ సంయుక్త చర్యల ద్వారా దిగుమతిపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని సూచించారు. జౌళి పరికరాల తయారీ సంస్థలు పాత పద్ధతుల నుంచి బయటకు రావాలని, పరిశ్రమను ఉత్తేజితం చేసే విధంగా పనిచేయాలని అన్నారు. జౌళి పరికరాల తయారీ సంస్థలతో వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. విదేశీ ప్రాంతాలకు చెందిన 15 జౌళి మెషీన్‌ సంస్థలు, 20 దేశీయ తయారీదార్లు, ఏడు టెక్స్‌టైల్‌ మెషినరీ సంఘాలు ఇందులో పాల్గొని, వారి అభిప్రాయాలను సమర్పించాయి. భారత్‌లో తయారీ కింద దేశంలో జౌళి ఇంజినీరింగ్‌ పరిశ్రమ వృద్ధికి అవసరమైన వ్యవస్థను అభివృద్ధి చేసే వ్యూహాల అమలు కోసం ఈ కార్యక్రమం నిర్వహించారు. జాతీయ యంత్ర పరికరాల విధానంలో భాగంగా 2025 నాటికి వీటి ఉత్పత్తిని 101 బిలియన్‌ డాలర్లకు పెంచడమే లక్ష్యమని గోయల్‌ తెలిపారు. ఇక జౌళి పరిశ్రమకు ఊతమిచ్చేందుకు సవరించిన టెక్నాలజీ అప్‌గ్రేడేషన్‌ ఫండ్‌ స్కీమ్‌ (ఏటీయూఎఫ్‌ఎస్‌)ను గోయల్‌ సమీక్షించారు.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని