సహజవాయువు కిందకు!
close

Published : 25/10/2021 02:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సహజవాయువు కిందకు!

కమొడిటీస్‌ ఈ వారం


బంగారం

పసిడి డిసెంబరు కాంట్రాక్టు ఈవారం రూ.47,305 కంటే దిగువన ట్రేడ్‌ కాకుంటే.. మరింతగా రాణించే అవకాశం ఉంది. ఒకవేళ కిందకు వచ్చినా రూ.47,231 వద్ద కాంట్రాక్టుకు మద్దతు లభించవచ్చు. ఈ స్థాయిని కోల్పోతేనే రూ.46,664కి పడిపోయే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో రూ.47,231 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకుని రూ.47,384 సమీపంలో కాంట్రాక్టుకు లాంగ్‌ పొజిషన్లు తీసుకోవచ్చు. అమెరికా విడుదల చేసే కీలక ఆర్థిక గణాంకాలు, డాలరు కదలికలు, ఇతర అంతర్జాతీయ పరిణామాలు కాంట్రాక్టుకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.

* ఎంసీఎక్స్‌ బుల్‌డెక్స్‌ నవంబరు కాంట్రాక్టు రూ.14,164 కంటే దిగువన కదలాడకుంటే.. రూ.14,506; రూ.14,616 వరకు పెరుగుతుందని భావించవచ్చు.


వెండి

వెండి డిసెంబరు కాంట్రాక్టు రూ.64,217 కంటే కిందకు వస్తే మరింత దిద్దుబాటుకు లోనై రూ.63,372; రూ.62,249 స్థాయిలకు పడిపోయే అవకాశం ఉంది. ఒకవేళ రూ.66,309 స్థాయిని అధిగమిస్తే రూ.67,477 వరకు పెరుగుతుందని భావించవచ్చు.


ప్రాథమిక లోహాలు

* ఎంసీఎక్స్‌ మెటల్‌డెక్స్‌ నవంబరు కాంట్రాక్టు రూ.18,137 ఎగువకు వెళ్లకుంటే.. దిద్దుబాటుకు ఆస్కారం ఉంటుంది.

* రాగి నవంబరు కాంట్రాక్టు రూ.787 కంటే పైన కదలాడితే.. రాణించేందుకు అవకాశం ఉంటుంది.

* సీసం నవంబరు కాంట్రాక్టు రూ.195.25 కంటే ఎగువన చలించకుంటే.. మరింతగా కిందకు రావచ్చు. ఈ నేపథ్యంలో రూ.195.60 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకుని.. షార్ట్‌ సెల్‌ పొజిషన్లు తీసుకోవచ్చు.

* జింక్‌ నవంబరు కాంట్రాక్టును రూ.302 ఎగువన షార్ట్‌ సెల్‌ చేయొచ్చు. అయితే రూ.304.35 వద్ద స్టాప్‌లాస్‌ను పరిగణించాల్సి ఉంటుంది.

* అల్యూమినియం నవంబరు కాంట్రాక్టు రూ.252.95 కంటే పైన కదలాడకుంటే కొంత షార్ట్‌ సెల్లింగ్‌ చోటుచేసుకునే అవకాశం ఉంటుంది.

* నికెల్‌ నవంబరు కాంట్రాక్టు రూ.1,582 కంటే ఎగువన నిలదొక్కుకోకుంటే.. రూ.1,486 వరకు దిద్దుబాటు అవుతుందని భావించవచ్చు.


ఇంధన రంగం

* సహజవాయువు నవంబరు కాంట్రాక్టు రూ.426 కంటే పైన కదలాడకుంటే.. మరింతగా కిందకు దిగివచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో రూ.435 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకుని రూ.424.50- రూ.426.05 శ్రేణిలో కాంట్రాక్టుకు షార్ట్‌ సెల్‌ పొజిషన్లు తీసుకోవచ్చు.

*  ముడి చమురు నవంబరు కాంట్రాక్టు రూ.6,171 కంటే దిగువన కదలాడితే రూ.6,123; రూ.5,967 వరకు దిద్దుబాటు అయ్యేందుకు అవకాశం ఉంటుంది.

* ముడి పామోలిన్‌ నూనె (సీపీఓ) నవంబరు కాంట్రాక్టు రూ.1,091 ఎగువకు వెళ్లకుంటే.. షార్ట్‌ సెల్‌ పొజిషన్లు తీసుకోవచ్చు.


వ్యవసాయ ఉత్పత్తులు

* పసుపు నవంబరు కాంట్రాక్టుకు ప్రతికూల ధోరణి కొనసాగే అవకాశం ఉంది. రూ.7,125; రూ.7,010 వరకు పడిపోతుందని భావించవచ్చు. 

* జీలకర్ర నవంబరు కాంట్రాక్టు రూ.14,445 కంటే దిగువన ట్రేడయితే మరింత దిద్దుబాటు అయ్యేందుకు అవకాశం ఉంటుంది.

* సోయాబీన్‌ నవంబరు కాంట్రాక్టు రూ.4,911 కంటే కిందకు రాకుంటే రూ.5,434 లక్ష్యంతో లాంగ్‌ పొజిషన్లు తీసుకోవచ్చు.

- ఆర్‌ఎల్‌పీ కమొడిటీ అండ్‌ డెరివేటివ్స్‌


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని