5జీ పరీక్షల గడువు 6 నెలలు పెంచండి
close

Updated : 26/10/2021 10:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

5జీ పరీక్షల గడువు 6 నెలలు పెంచండి

కేంద్రాన్ని కోరిన టెల్కోలు

దిల్లీ: 5జీ పరీక్షల గడువును ఆరు నెలల పాటు పొడిగించాలని రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా వంటి ఆపరేటర్లు టెలికాం విభాగాన్ని(డాట్‌) కోరాయి. వివిధ ప్రాంతాల్లోని 700 మెగాహెర్ట్జ్‌, 3.3-3.6 గిగాహెర్ట్జ్‌; 24.25-28.5 గిగాహెర్ట్జ్‌ బాండ్‌లలోని స్పెక్ట్రమ్‌ను ఆరు నెలల పాటు టెల్కోలకు మే నెలలో కేంద్రం కేటాయించిన సంగతి తెలిసిందే. ‘అన్ని టెలికాం కంపెనీలు 5జీ పరీక్షలను మరో ఆరు నెలల పాటు పొడిగించాలని కోరాయ’ని ప్రభుత్వంలోని ఒక సీనియర్‌ అధికారి తెలిపారు. ప్రస్తుత పరీక్షల గడువు నవంబరుతో ముగుస్తుంది. 5జీని వాణిజ్యపరంగా ప్రారంభించడానికి డాట్‌ ప్రక్రియను మొదలుపెట్టింది. స్పెక్ట్రమ్‌ వేలానికి సంబంధించి ధరలు, పద్ధతులపై ట్రాయ్‌ అభిప్రాయాన్ని కూడా కోరింది. ప్రస్తుతానికి వేలం తేదీపై ఎటువంటి స్పష్టత లేనప్పటికీ ఏప్రిల్‌-జూన్‌ 2022లో జరగొచ్చని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని