4 ఏళ్ల మారటోరియానికి ఎయిర్‌టెల్‌ అంగీకారం
close

Updated : 26/10/2021 10:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

4 ఏళ్ల మారటోరియానికి ఎయిర్‌టెల్‌ అంగీకారం

దిల్లీ: సర్దుబాటు చేసిన స్థూల ఆదాయాలు(ఏజీఆర్‌), స్పెక్ట్రమ్‌ బకాయిల చెల్లింపులకు నాలుగేళ్ల మారటోరియాన్ని(విరామం) అంగీకరిస్తున్నట్లు ప్రభుత్వానికి భారతీ ఎయిర్‌టెల్‌ సమాచారాన్ని అందించింది. శుక్రవారమే ఆ మేరకు టెలికాం విభాగానికి(డాట్‌) ఎయిర్‌టెల్‌ తెలియజేసిందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. టెలికాం రంగానికి ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీలో భాగంగా బకాయిలపై మారటోరియం ఆప్షన్‌ ఇచ్చిన సంగతి విదితమే. కాగా, తాజా పరిణామంపై స్పందించాలని పంపిన మెయిల్‌కు ఎయిర్‌టెల్‌ నుంచి ఇంకా స్పందన రాలేదు. బకాయిల చెల్లింపులపై మారటోరియం కావాలో వద్దో అక్టోబరు 29లోగా తెలపాలని భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా, జియోలను కోరుతూ ప్రభుత్వం ఇటీవల లేఖ రాసిన సంగతి తెలిసిందే. మారటోరియం సమయానికి చెందిన వడ్డీని ఈక్విటీగా మార్చేందుకు కూడా అంగీకారం తెలపడానికి ఆపరేటర్లకు డాట్‌ 90 రోజుల గడువు ఇచ్చింది. స్పెక్ట్రమ్‌ చెల్లింపులపై మారటోరియాన్ని అందిపుచ్చుకోవడానికి బోర్డు అంగీకారం తెలిపిందని వొడాఫోన్‌ ఐడియా గత వారమే పేర్కొన్న విషయం తెలిసిందే.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని