‘ప్రగతి ఓఎస్‌’తో జియోఫోన్‌ నెక్స్ట్‌
close

Updated : 26/10/2021 12:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ప్రగతి ఓఎస్‌’తో జియోఫోన్‌ నెక్స్ట్‌

జియో, గూగుల్‌ సంయుక్త అభివృద్ధి
తిరుపతిలో హ్యాండ్‌సెట్ల తయారీ
30 కోట్ల 2జీ వినియోగదార్లే లక్ష్యం

దిల్లీ: వివిధ ప్రాంతీయ భాషలు మాట్లేడే వ్యక్తులను కలిపేందు కోసం.. మరీ ముఖ్యంగా దేశంలోని 30 కోట్ల మంది 2జీ వినియోగదార్లను లక్ష్యంగా చేసుకుని జియోఫోన్‌ నెక్స్ట్‌ 4జీ స్మార్ట్‌ఫోన్‌ వస్తోంది. ఇది దీపావళికి ముందే మార్కెట్లోకి రావొచ్చని అంచనా. ఈ ఫోన్‌ కోసం జియో ప్లాట్‌ఫామ్స్‌, గూగుల్‌లు సంయుక్తంగా ‘ప్రగతి’ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను అభివృద్ధి చేశాయి. సోమవారం కంపెనీ విడుదల చేసిన వీడియోలో ఇందుకు సంబంధించిన పలు వివరాలను వెల్లడించింది. ‘2జీ ముక్త్‌(2జీ రహిత) భారత్‌ను తయారు చేయడం కోసం అత్యంత అందుబాటు ధరలో 4జీ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొస్తామని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ 44వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.

టచ్‌స్క్రీన్‌తో వస్తున్న ఈ ఫోన్‌లో భారత్‌లో పలు భాషలు మాట్లాడే వారికి అనుగుణంగా భాషా-అనువాద టూల్‌ నిక్షిప్తం చేశారు. ఈ ఫీచరు దాదాపు 10 భారతీయ భాషలను అనువాదం చేయగలదు. ‘గూగుల్‌తో కలిసి జియో భారత్‌ కోసం పనిచేస్తోంది. ప్రగతి ఓఎస్‌ను యాండ్రాయిడ్‌ ఆధారంగా సిద్ధం చేశామ’ని యాండ్రాయిడ్‌ జనరల్‌ మేనేజర్‌ రామ్‌ పాపట్ల పేర్కొన్నారు. ‘ఈ ఫోన్‌లోని అనువాద ఫీచరు సహాయంతో ఒక భాషలో మాట్లాడితే ఫోన్‌ ద్వారా ఇంకో భాషలోకి అనువాదం చేసుకోవచ్చ’ని జియోఫోన్‌ నెక్స్ట్‌ ప్రోడక్ట్‌ మేనేజ్‌మెంట్‌ బినిష్‌ పరంగోదత్‌ అన్నారు. ‘ఫోన్‌లో ఉండే గట్టిగా చదివి వినిపించే (రీడ్‌ అలౌడ్‌) ఫీచరు సహాయంతో ఏదైనా యాప్‌లోని కంటెంట్‌ను చదివి వినిపించుకోవచ్చ’ని జియోఫోన్‌ నెక్స్ట్‌ తయారీ, సరఫరా వ్యవస్థకు చెందిన అశోక్‌ అగర్వాల్‌ అన్నారు.

తయారీ ఎక్కడంటే..

జియోఫోన్‌లో క్వాల్‌కామ్‌ ప్రాసెసర్‌ ఉంటుంది. ఇది తిరుపతి, శ్రీపెరంబదూరులో ఆర్‌ఐఎల్‌ గ్రూప్‌నకు చెందిన నియోలింక్‌ యూనిట్‌లో తయారవుతుంది. జియో ఫోన్‌తో మన దేశం మరింత ‘ఆత్మనిర్భర్‌’గా మారుతుందని పరంగోదత్‌ అన్నారు. సెమీకండక్టర్ల కొరతతో పాటు ఫీచర్లను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దడం కోసం ఫోన్‌ ఆవిష్కరణ తేదీని సెప్టెంబరు 10 నుంచి దీపావళి పండగ సీజనుకు కంపెనీ మార్చిన సంగతి తెలిసిందే.

ఇవీ ఫీచర్ల వివరాలు..

వాయిస్‌ అసిస్టెంట్‌: ఈ ఫీచరు సహాయంతో వినియోగదారు ఫోన్‌లో ఏదైనా యాప్‌ను ఓపెన్‌ చేయించొచ్చు. మనకు నచ్చిన భాషలోనే ఇంటర్నెట్‌లోని కంటెంట్‌/సమాచారాన్ని పొందొచ్చు.

ట్రాన్స్‌లేట్‌: తెరపై ఉన్న ఏ కంటెంట్‌నైనా సరే వినియోగదారుకు ఇష్టమైన భాషలోకి అనువాదం చేస్తుంది.  

స్మార్ట్‌ కెమేరా: ఇందులో ఉండే స్మార్ట్‌, శక్తివంతమైన కెమేరాతో పలు మోడ్‌లలో నచ్చిన విధంగా ఫొటోలు తీసుకోవచ్చు. నైట్‌ మోడ్‌ కూడా ఇందులో ఉంది. ఆగుమెంటెడ్‌ రియాల్టీ ఫిల్టర్లు కూడా కెమేరా యాప్‌లో ఉన్నాయి.

బ్యాటరీ: ఆటోమేటిక్‌ సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌తో పాటు మెరుగైన బ్యాటరీ జీవితం దీని సొంతం. ఎక్కువ కాలం పాటు ఛార్జ్‌ పెట్టకుండానే వినియోగించుకోవచ్చు.Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని