ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ ఏఎంసీ లాభం రూ.173 కోట్లు
close

Updated : 26/10/2021 10:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ ఏఎంసీ లాభం రూ.173 కోట్లు

దిల్లీ: 2021-22 సెప్టెంబరు త్రైమాసికంలో ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ ఏఎంసీ రూ.173.1 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో సంస్థ నమోదు చేసిన రూ.125.4 కోట్ల నికర లాభంతో పోలిస్తే ఇది 38 శాతం అధికం. మొత్తం ఆదాయం కూడా రూ.291 కోట్ల నుంచి 28 శాతం పెరిగి రూ.372.2 కోట్లకు చేరింది. రూ.5 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.5.60 మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది. ‘వివిధ అసెట్‌ కేటగిరీల్లో మా నిర్వహణలోని మొత్తం ఆస్తుల్ని పెంచుకోవడంపై దృష్టి కొనసాగిస్తాం. సిప్‌లో స్థిరమైన వృద్ధి, ఈక్విటీ ఏయూఎం, బి-30 అసెట్స్‌, ఫోలియోల సంఖ్య, భిన్న ఉత్పత్తులతో ముందుకు వెళుతున్నామ’ని ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ ఏఎంసీ ఎండీ, సీఈఓ ఎ.బాలసుబ్రమణియన్‌ వెల్లడించారు. ఆదిత్య బిర్లా గ్రూప్‌, కెనడాకు చెందిన సన్‌ లైఫ్‌ ఫైనాన్షియల్‌ సంయుక్త సంస్థే ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ ఏఎంసీ. ఈ నెలలోనే స్టాక్‌ మార్కెట్‌లో నమోదైంది.

బీఎస్‌ఈలో షేరు 1.03 శాతం నష్టపోయి రూ.651.75 వద్ద ముగిసింది.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని