కచ్చితమైన ఆడిట్‌తోనే ఆర్థిక స్థిరత్వం
close

Published : 26/10/2021 03:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కచ్చితమైన ఆడిట్‌తోనే ఆర్థిక స్థిరత్వం

ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌

దిల్లీ: ఆర్థిక స్థిరత్వానికి, వృద్ధికి కచ్చితమైన, విశ్లేషణాత్మక ఆడిట్‌ నివేదికలు అత్యంత అవసరమని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ పేర్కొన్నారు. అటువంటి నివేదికలు ప్రజల్లో విశ్వాసం నింపుతాయని ఆయన అన్నారు. సోమవారమిక్కడ జరిగిన నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ ఆడిట్‌ అండ్‌ అకౌంట్స్‌(ఎన్‌ఏఏఏ)లో అధికార్లనుద్దేశించి ఆయన ప్రసంగిస్తూ ‘ప్రభుత్వ రంగంలో ఆడిటింగ్‌ అనేది మంచి పాలనకు మూలస్తంభం వంటిది. ప్రజలకు చెందిన వనరులను బాధ్యతాయుతంగా నిర్వహిస్తున్నారా లేదా అన్నది పక్షపాతం లేకుండా మదింపు చేస్తే అనుకున్న ఫలితాలను సాధించవచ్చు. న్యాయబద్ధంగా ఇచ్చే ఆడిట్‌ల వల్ల పౌరుల్లో విశ్వాసం పెరుగుతుంద’ని అన్నారు. దీని వల్ల అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్ట, విశ్వసనీయత కూడా పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆర్థిక మార్కెట్లలో సంక్లిష్టత పెరగడం, సమర్థవంతంగా వనరుల కేటాయింపు విషయంలో ప్రజలకు అంచనాలు పెరిగిన నేపథ్యంలో ఆడిట్‌ పాత్ర మరింత కీలకంగా మారిందని ఈ సందర్భంగా దాస్‌ అన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని