ఈ సంవత్సరాంతం నుంచి కొవిడ్‌ టీకా ఎగుమతులు?
close

Published : 26/10/2021 03:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈ సంవత్సరాంతం నుంచి కొవిడ్‌ టీకా ఎగుమతులు?

దిల్లీ: మనదేశం నుంచి ఇతర దేశాలకు కొవిడ్‌ టీకా ఎగుమతులు ఈ సంవత్సరాంతం నుంచి మొదలవుతాయని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. అదే సమయంలో మనదేశంలో టీకా కార్యక్రమానికి నష్టం జరగకుండా ఈ ఎగుమతులు ఉంటాయని పేర్కొన్నారు. ఈ ఏడాది చివరి నాటికి మన దేశ అవసరాల కంటే మిన్నగా టీకా లభ్యత ఉంటుందని, అందువల్ల ఎగుమతులకు ఇబ్బంది ఉండకపోవచ్చని వివరించారు. ఎగుమతులను కూడా ఆయా దేశాల అవసరాలను పరిగణనలోకి తీసుకొని, పూర్తి పరిశీలన తర్వాతే నిర్ణయిస్తామని అన్నారు. ముఖ్యంగా ‘కొవాక్స్‌’ కార్యక్రమం కింద మన బాధ్యతగా టీకా అందించాల్సి ఉన్నట్లు, దాన్ని పూర్తిచేయాలనే ఆలోచన ఉన్నట్లు తెలిపారు. ‘కొవాక్స్‌’..., గావి, కోయిలేషన్‌ ఆఫ్‌ ఎపిడమిక్‌ ప్రిపేర్డ్‌నెస్‌ ఇన్నోవేషన్స్‌, డబ్లూహెచ్‌ఓ సంయుక్త కార్యక్రమం. ఇప్పటి వరకూ మనదేశం నుంచి నేపాల్‌, బంగ్లాదేశ్‌, మ్యాన్మర్‌, ఇరాన్‌కు టీకాలు ఎగుమతి అయ్యాయి. కానీ ఈ ఏడాది  ఏప్రిల్‌ నుంచి కరోనా మహమ్మారి రెండో దశ విస్తరించిన ఫలితంగా టీకాల ఎగుమతులను కేంద్ర ప్రభుత్వం నిలుపుదల చేసింది. పరిస్థితులు సానుకూలంగా మారుతున్న నేపథ్యంలో మళ్లీ ఎగుమతుల అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి టీకాల ఉత్పత్తి పెరగటం, దేశీయ అవసరాలు తగ్గిపోయే అవకాశం ఉండటంతో ఎగుమతులు మొదలుపెట్టాలని భావిస్తోంది.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని