28 నుంచి నైకా ఐపీఓ
close

Published : 26/10/2021 03:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

28 నుంచి నైకా ఐపీఓ

ఇష్యూ ధర రూ.1,085-1,125

దిల్లీ: ఆన్‌లైన్‌ బ్యూటీ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ నైకాను నిర్వహిస్తున్న ఎఫ్‌ఎస్‌ఎన్‌ ఇ-కామర్స్‌ వెంచర్‌ తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) ధరను సోమవారం ప్రకటించింది. ఒక్కో షేరుకు రూ.1,085-1,125 మధ్య ధరల శ్రేణిని నిర్ణయించింది. ఈ నెల 28న ఇష్యూ ప్రారంభమై, నవంబరు 1న ముగుస్తుంది. తాజా షేర్ల ఇష్యూ ద్వారా రూ.630 కోట్లు సమీకరించనుంది. అలాగే 4,19,72,660 ఈక్విటీ షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) పద్ధతిలో విక్రయించనుంది. కనీసం 12 షేర్లను (12 గుణిజంలో) ఒక లాట్‌గా నిర్ణయించింది. ఈ ఇష్యూతో కంపెనీ విలువను 700 కోట్ల డాలర్లకు పైగా (సుమారు రూ.52,000 కోట్లు) చేర్చాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన సంస్థల్లో టీపీజీ గ్రోత్‌ ఐవీ ఎస్‌ఎఫ్‌, లైట్‌ హౌస్‌ ఇండియా ఫండ్‌ ఈ ఐపీఓలో షేర్లను విక్రయించేందుకు సిద్ధమయ్యాయి. కంపెనీ వ్యవస్థాపకులు, సీఈఓ ఫల్గుణి నాయర్‌కు ప్రస్తుతం కంపెనీలో 50 శాతానికి పైగా వాటాలున్నాయి. 2020-21లో నైకా రూ.61.9 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని