పేటీఎం సహా 7 ఐపీఓలకుసెబీ అనుమతి
close

Published : 26/10/2021 03:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పేటీఎం సహా 7 ఐపీఓలకుసెబీ అనుమతి

దిల్లీ: ఈఎస్‌ఏఎఫ్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ సహా 7 కంపెనీల ఐపీఓలకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతి ఇచ్చింది. ఇందులో సఫైర్‌ ఫుడ్స్‌ ఇండియా (కేఎఫ్‌సీ, పిజా హట్‌లను నిర్వహిస్తున్న సంస్థ), ఆనంద్‌ రాఠి వెల్త్‌, పీబీ ఫిన్‌టెక్‌, పాలసీ బజార్‌, పైసా బజార్‌, ఒన్‌97 కమ్యూనికేషన్స్‌ (పేటీఎం మాతృ సంస్థ), టార్సన్స్‌ ప్రోడక్ట్‌, హెచ్‌పీ అడ్హెసివ్స్‌ సంస్థలున్నాయి. ఈ కంపెనీలన్నీ జులై-ఆగస్టు మధ్య ఐపీఓ అనుమతుల కోసం సెబీ వద్ద దరఖాస్తు చేసుకోగా, సోమవారం వీటికి తుది అనుమతులు లభించాయి. ఈఎస్‌ఏఎఫ్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ ఐపీఓ ద్వారా రూ.997.78 కోట్ల (రూ.800 కోట్ల తాజా షేర్ల ఇష్యూతో కలిపి) నిధుల్ని సమీకరించబోతోంది. సఫైర్‌ ఫుడ్స్‌ ఇండియా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) ద్వారా 1,75,69,941 షేర్లను విక్రయించబోతోంది. ఆనంద్‌ రాఠి గ్రూప్‌నకు చెందిన ఆనంద్‌ రాఠి వెల్త్‌ కూడా ఓఎఫ్‌ఎస్‌ ద్వారా 1.2 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించాలనుకుంటోంది.

రూ.16,600 కోట్ల సమీకరణ: పేటీఎం సెబీ వద్ద దరఖాస్తు చేసిన ముసాయిదా పత్రాల ప్రకారం, తాజా ఈక్విటీ షేర్ల ఇష్యూ ద్వారా రూ.8,300 కోట్ల నిధుల్ని సమీకరించేందుకు సిద్ధమవుతోంది. అలాగే ఓఎఫ్‌ఎస్‌ ద్వారా రూ.8,300 కోట్లను సమీరించనుంది.

పీబీ ఫిన్‌టెక్‌ తాజా ఇష్యూ ద్వారా రూ.3,750 కోట్లను, ఓఎఫ్‌ఎస్‌ ద్వారా రూ.2,267.50 కోట్లను సమీకరించబోతోంది.

టార్సన్స్‌ ప్రోడక్ట్స్‌ ఐపీఓలో తాజా షేర్లను విక్రయించి రూ.150 కోట్లు, ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో 1.32 కోట్ల షేర్లను విక్రయించేందుకు కంపెనీ సిద్ధమైంది.

హెచ్‌పీ అడ్హెసివ్స్‌ తొలి పబ్లిక్‌ ఆఫర్‌లో 41.40 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించబోతోంది. అలాగే ప్రమోటర్‌ అంజనా హరేశ్‌ మోత్వానీ ఓఎఫ్‌ఎస్‌ పద్ధతిలో 4,57,200 ఈక్విటీ షేర్లను విక్రయించేందుకు సిద్ధమయ్యారు.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని