టాటాలతో షేర్ల కొనుగోలు ఒప్పందం
close

Published : 26/10/2021 03:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టాటాలతో షేర్ల కొనుగోలు ఒప్పందం

కుదుర్చుకున్న ప్రభుత్వం
రూ.18,000 కోట్లకు ఎయిరిండియా విక్రయం

దిల్లీ: టాటాసన్స్‌కు ఎయిరిండియాను రూ.18,000 కోట్లకు విక్రయించడానికి సంబంధించిన షేర్ల కొనుగోలు ఒప్పందంపై ప్రభుత్వం సంతకాలు చేసింది. టాటా సన్స్‌కు చెందిన టాలెస్‌ ఆఫర్‌ చేసిన రూ.2700 కోట్ల నగదు; రూ.15,300 కోట్ల ఎయిరిండియా అప్పుల టేకోవర్‌ ఆఫర్‌ను ఈ నెల మొదట్లో ప్రభుత్వం అంగీకరించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అక్టోబరు 11న టాటా గ్రూప్‌నకు ఎయిరిండియాలో 100 శాతం వాటాను విక్రయించడానికి సంసిద్ధతను వ్యక్తం చేస్తూ లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌(ఎల్‌ఓఐ)ను సైతం జారీ చేసింది. తదుపరి దశ కింద ‘టాటా సన్స్‌కు ఎయిరిండియాలో వాటా విక్రయించేందుకు షేర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్‌ (ఎస్‌పీఏ)పై ప్రభుత్వం సోమవారం సంతకాలు చేసింద’ని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం(దీపమ్‌) కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే ట్వీట్‌ చేశారు. ఎయిరిండియా డైరెక్టర్‌(ఫైనాన్స్‌) వినోద్‌ హేజ్‌మాడి, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సత్యేంద్ర మిశ్రా, టాటా గ్రూప్‌నకు చెందిన సూర్యప్రకాశ్‌ ముఖోపాధ్యాయ్‌లు ఈ ఎస్‌పీఏపై సంతకాలు చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని